NTV Telugu Site icon

War 2 : వార్ 2 నుంచి ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్..

Untitled Design (75)

Untitled Design (75)

‘దేవ‌ర‌’ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్న స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రంలో హృతికి రోష‌న్ క‌థానాయకుడిగా న‌టిస్తుండ‌గా.. తార‌క్ కీల‌క పాత్రలో నటిస్తున్నాడు.అయ‌న్ ముఖ‌ర్జీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ ఆదిత్య చోప్రా నిర్మిస్తుండ‌గా.. ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుగుతుంది. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Also Read: 8 Vasanthalu : ‘8 వసంతాలు’ నుండి మోలోడి సాంగ్ రిలీజ్..

ఈ మూవీలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య క్రేజీ డ్యాన్స్ సీక్వెన్స్ ఉండ‌బోతుందట. పాట కోసమే ఏకంగా 500 మంది డ్యాన్స్​ర్లను రంగంలోకి దింపిన‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. హృతిక్, ఎన్టీఆర్ మధ్య వ‌చ్చే ఈ డ్యాన్స్‌లో మునుపెన్నడూ చూడని విధంగా ఓ సరికొత్త పాటని ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. య‌ష్‌రాజ్ స్టూడియోలో ప్రస్తుతం ఈ డ్యాన్స్ షూటింగ్ జ‌రుగుతున్నట్లు స‌మాచారం. అంతే కాదు ప్రీతమ్ మ్యూజిక్ లో రానున్న ఈ సాంగ్‌ని బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫర్ చేస్తున్నాడట. ఇందుకోసం ప్రొడక్షన్ డిజైనర్ అమృత మహల్ అద్భుతమైన సెట్ కూడా నిర్మించారని, ప్రీతమ్ చాలా ఫాస్ట్ బీట్తో సాగే పాటను కంపోజ్ చేశారని బాలీవుడ్ టాక్. ఇక ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలిదు కానీ.. 500 మంది డ్యాన్సర్లతో హృతిక్, ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటే థియేట‌ర్‌లు ఏ రేంజ్‌లో ఊగిపోతాయో ఊహించుకోండి..