దర్శక దిగ్గజం SS రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం SSMB29. హాలీవుడ్ బ్యూటీ ప్రియింక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు #GlobeTrotter పేరోతో హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో సినిమా టైటిల్ తో పాటు వీడియో గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు.
Also Read : Tollywood : బాలీవుడ్ సీనియర్ బ్యూటీస్ బ్యాక్ టు టాలీవుడ్
ఈ రోజు కోసమే సూపర్ స్టార్ మహేశ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అసలు తమ అభిమాన హీరోను రాజమౌళి ఎలా చూపించాడు ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఆ తరుణం రానే వచ్చింది. అందుకు రామోజీ ఫిల్మ్ సిటీ గ్రాండ్ గా ముస్తాబయింది. అటు ఫ్యాన్స్ ఈవెంట్ పాస్ ల కోసం ఆరాటపడుతున్నారు. మహేశ్ బాబును నేరుగా చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి రామోజీకి చేరుకుంటున్నారు ఘట్టమనేని అభిమానులు. అటు ఫ్యాన్స్ అందరూ ఇబ్బంది పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. ఈ రోజు సాయంత్రం 5.30 గంటల నుండి #GlobeTrotter ఈవెంట్ స్టార్ట్ కానుంది. వేలాది మంది సూపర్ స్టార్ అభిమానులు సమక్షంలో SSMB29 టైటిల్ రిలీజ్ కాబోతుంది. భారీ అంచనాలు భారీ బడ్జెట్ పై వస్తున్న SSRMB ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
