ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ETV విన్, విభిన్నమైన కథలను ప్రోత్సహిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో భాగంగా, ‘4 టేల్స్’ – 4 స్టోరీస్, 4 ఎమోషన్స్, 4 సండేస్ అనే వినూత్న కాన్సెప్ట్‌తో ఒక వైవిధ్యమైన ఆంథాలజీ సిరీస్‌ను మన ముందుకు తీసుకొచ్చింది. సినీ రంగంలో కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ETV విన్ చేపట్టిన ‘కథా సుధ’ కార్యక్రమంలో భాగంగా, ఈ సిరీస్‌లోని మొదటి కథ ‘ది మాస్క్’ ఈ వారం ప్రీమియర్ అయ్యింది. ఈ ఆంథాలజీ ట్రైలర్‌ను దిగ్గజ దర్శకులు ఆర్జీవీ, హరీష్ శంకర్, ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ విడుదల చేయడం విశేషం.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకుని అప్పుల పాలవుతాడు ఒక యువకుడు. ఆ అప్పు తీర్చడానికి ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళి, అక్కడ ఊహించని విధంగా చిక్కుకుంటాడు. ఆ తర్వాత అతను ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ఆ ఆపద నుండి ఎలా బయటపడ్డాడు? అనేదే ఈ చిత్ర కథాంశం. చిన్న కథాంశంలోనే సస్పెన్స్, డ్రామా, మరియు డార్క్ హ్యూమర్‌ను అద్భుతంగా మిళితం చేసి, దర్శకుడు బుల్లితెరపైనే ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించారు. నరుడి బ్రతుకు నటన’ దర్శకుడు రిషికేశ్వర్ యోగి సమర్పణలో, ‘కథా గని పిక్చర్స్’ బ్యానర్‌పై కొత్తపల్లి సురేష్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఇందులో రావన్ నిట్టూరి, గడ్డం శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.
