Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Erra Mallelu Completes 40 Years

‘కళ శ్రమైక సహజీవనం కోసం’ అని చాటిన ‘ఎర్ర మల్లెలు’

Published Date :May 1, 2021 , 5:28 am
By Prakash
‘కళ శ్రమైక సహజీవనం కోసం’ అని చాటిన ‘ఎర్ర మల్లెలు’
  • Follow Us :
  • google news
  • dailyhunt

(మే 1న ‘ఎర్రమల్లెలు’కు 40 ఏళ్లు)
తొలి నుంచీ అభ్యుదయ భావాలు కలిగి, వామపక్ష ఆదర్శాల నీడన మసలారు నటుడు, నిర్మాత, దర్శకుడు మాదాల రంగారావు. ఆరంభంలో చిన్న చిన్న పాత్రల్లో తెరపై కనిపించిన మాదాల రంగారావు తరువాత మిత్రులతో కలసి నవతరం పిక్చర్స్ నెలకొల్పారు. ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు, దర్శకుడు టి.కృష్ణ వంటివారు ఈ ‘నవతరం’ నీడలో నిలచిన వారే. తొలి ప్రయత్నంగా మాదాల రంగారావు నిర్మించి, నటించిన ‘యువతరం కదిలింది’ చిత్రం మంచి విజయం సాధించింది. పెట్టుబడికి తగిన లాభాలను చూపింది ఆ సినిమా. దాంతో తన వామపక్ష భావాలను మరోమారు పలికిస్తూ మాదాల రంగారావు నిర్మించిన చిత్రం ‘ఎర్రమల్లెలు’. ‘యువతరం కదిలింది’కి దర్శకత్వం వహించిన ధవళ సత్యం ‘ఎర్రమల్లెలు’ కూడా రూపొందించారు. 1981 మే 1న విడుదలైన ‘ఎర్రమల్లెలు’ మరోమారు మాదాలకు విజయాన్ని చవిచూపింది.

ఓ పల్లె, దానికి ఆనుకుని ఉన్న ఓ పట్టణం. ఈ రెండింటిలోనూ కరణం, మునసబు, కామందులు, పరిశ్రమల యజమానులు జనం రక్తం జలగల్లా పీల్చేవారు. పల్లెలో కరణం, మునసబు, కామందు ఎన్నో అకృత్యాలు చేస్తూ ఉంటారు. ఇక ఫ్యాక్టరీ యజమాని పనిగంటలు పెంచి, వారి శ్రమను దోచుకుంటూ ఉంటాడు. ఎదురు తిరిగిన రంగాను జైలుకు పంపిస్తారు. ప్రశ్నించిన సూరిబాబును పనిలోంచి తొలగిస్తారు. పల్లెకు వచ్చిన పంతులు ప్రజల్లో చైతన్యం రగిలిస్తాడు. ఇక సూరిబాబు న్యాయపోరాటంలో గెలుస్తాడు. పంతులును చంపాలనుకుంటారు. ఊరి జనం తిరగబడతారు. సూరిబాబును చంపిస్తారు. చివరకు జనం అంతా ఒక్కటై రంగా నాయకత్వంలో దుర్మార్గులందరినీ బుగ్గి చేయడంతో కథ ముగుస్తుంది.

‘ఎర్రమల్లెలు’ చిత్రంలో మురళీమోహన్, గిరిబాబు, మాదాల రంగారావు, రంగనాథ్, పి.ఎల్.నారాయణ, సాక్షి రంగారావు, పి.జె.శర్మ, సాయిచంద్, చలపతిరావు, నర్రా వెంకటేశ్వరరావు, వీరభద్రరావు, వై.విజయ, కృష్ణవేణి, లక్ష్మీచిత్ర నటించారు. తరువాతి రోజుల్లో ‘ప్రతిఘటన’ వంటి సంచలన చిత్రాలు రూపొందించిన దర్శకుడు టి.కృష్ణ ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు. లాయర్ గా ఓ సన్నివేశంలో పోకూరి బాబూరావు కనిపించారు. మాదాల రంగారావు తనయుడు మాదాల రవి బాలనటునిగా నటించాడు. అతనిపై చిత్రీకరించిన “నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో…” అన్న పాట ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొంది. ఈ పాటతో పాటు “నేడే మేడే మేడే…” , “బంగారు మాతల్లీ భూమీ మా లచ్చిమీ..”, “ఏయ్ లగిజిగి లంబాడీ… తిరగబడర అన్నా…” అని సాగే పాటలు కూడా ఆదరణ పొందాయి.

మాదాల రంగారావు కథ అందించిన ఈ చిత్రానికి యమ్.జి. రామారావు మాటలు రాశారు. పాటలు సి.నారాయణరెడ్డి, కొండవీటి వెంకటకవి, అదృష్టదీపక్, ప్రభు, ధవళ సత్యం రాశారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. గౌరవ నిర్మాత అంటూ మాదాల కోదండరామయ్య పేరు ప్రకటించారు. కె.రాధాకృష్ణ నిర్వహణ బాధ్యతలు చూశారు.

మాదాల రంగారావు నిర్మాణసారథ్యంలో అంతకుముందు రూపొందిన ‘యువతరం కదిలింది’లో నటించిన కొందరు ఈ చిత్రంలోనూ కనిపిస్తారు. ‘యువతరం కదిలింది’ కంటే మిన్నగా ‘ఎర్రమల్లెలు’ విజయం సాధించింది. మాదాల రంగారావు చూపిన మార్గంలోనే ఆ తరువాత ఎందరో విప్లవనేపథ్యమున్న చిత్రాలను రూపొందించారు. ఆ చిత్రాలను చూసినప్పుడు సైతం మాదాల రంగారావు మన స్మృతిపథంలో మెదలక మానరు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Erra Mallelu
  • Madala Rangarao

తాజావార్తలు

  • Peddi: పెద్ది’ డిజిటల్ రైట్స్ పై న్యూ అప్‌డేట్..!

  • Story Board: ఎక్కడో యుద్ధం.. మన ఇంట్లో సంక్షోభం..

  • Ramayana: రామాయణ గ్రాఫిక్స్ పై ఆడియన్స్ సీరియస్!

  • Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..

  • Guavas Theft: అమానుషం.. జామకాయలు దొంగిలించిందని చిన్నారిని కొట్టి గొలుసులతో బంధించిన రిటైర్డ్ ఆర్మీ

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions