Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్‌కు పూనకాలే..

Aadarsha Kutumbam

Aadarsha Kutumbam

Aadarsha Kutumbam: టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ (Venkatesh), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్‌లో ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తాజాగా మేకర్స్ టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam – #AK47) అనే పవర్‌ఫుల్ అండ్ క్లాసిక్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకోవాల్సిన తేదీ అంటూ చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.

గతంలో వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ (త్రివిక్రమ్ రచయితగా) చిత్రాలు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో అందరికీ తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ (చిన్నబాబు) ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజా అప్‌డేట్‌తో వెంకీ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.