Site icon NTV Telugu

ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు వాడే… “ఎనిమీ” టీజర్

Enemy Telugu Official Teaser Out Now

కోలీవుడ్ స్టార్స్, స్నేహితులు విశాల్, ఆర్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ “ఎనిమీ”. తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “ఎనిమీ” సెప్టెంబరులో భారీ విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా టీజర్ ను విడుదల చేసి సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేశారు. ఈ టీజర్‌లో విశాల్, ఆర్యలు టామ్ అండ్ జెర్రీ ఆటలో పాల్గొన్నారు.

Read Also : కామెడీ థ్రిల్లర్ “మంచి రోజులు వచ్చాయి” టీజర్

విదేశీ జైలు నుండి తప్పించుకునే ఖైదీ పాత్రను ఆర్య పోషించగా, విశాల్ పోలీసుగా కనిపిస్తారు. ఇందులో తమన్ అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం, అందమైన ప్రదేశాలు బాగున్నాయి. యాక్షన్ సన్నివేశాలు చక్కగా చిత్రీకరించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి టీజర్ తోనే అదరగొట్టేశాడు విశాల్. ప్రకాష్ రాజ్ కథ గురించి వివరిస్తూ ‘మీ రహస్యాలన్నీ తెలిసిన స్నేహితుడు మీ అతిపెద్ద శత్రువు. ఇది స్నేహితులు శత్రువులుగా మారిన కథ” అంటూ చెప్పడం సినిమాపై ఇంకా ఆసక్తిని పెంచేస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా టీడీర్ ను రిలీజ్ చేశారు. సినిమాను కూడా మూడు భాషల్లో విడుదల చేయనున్నారు.

Exit mobile version