NTV Telugu Site icon

Emergency: ‘ఎమర్జెన్సీ’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన కంగనా!

February 7 2025 02 22t094646.029

February 7 2025 02 22t094646.029

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. అనేక వాయిదాల అనంతరం జనవరి 17న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది.1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన ఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరా గాంధీ తన రాజకీయ జీవితంలోని ముఖ్య సంఘటనలు, ఆమె తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల దేశంపై ఏర్పడిన ప్రభావాలను సినిమాలో చూపించారు. కాగా ఇందిరాగాంధీగా కంగనా రనౌత్, జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్‌ తల్పడే నటించారు. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైనా సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

Also Read: Kangana announces OTT streaming date for ‘Emergency’ movie!

దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, థియేట్రికల్ రన్‌లో కేవలం రూ.21 కోట్ల వరకు మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం. ఇక తాజాగా ఈ మూవీ OTT రిలీజ్ పై కంగనా అప్ డేట్ ఇచ్చింది.తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘ఎమర్జెన్సీ’ ఓటీటీ విడుదల తేదీ వెల్లడిస్తూ, మార్చి 17 నుంచి నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ఇక థియేటర్లలో సక్సెస్ సాధించని ఈ చిత్రం, ఓటీటీ వేదికపై ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.