NTV Telugu Site icon

ENE 2 : ఈ నగరానికి ఏమైంది – 2 చిన్న కథ కాదు..

Ene2

Ene2

విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నగరానికి ఏమైంది. పెళ్లి చూపులు సక్సెస్ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా. 2018 లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేదు.  లైఫ్ అంటే నలుగురితో కలిసి, నాలుగు మంచి పనులు చేయడమే అనే కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల కాలంలో యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది.  ఆ మధ్య ఈ సినిమా రిలీరిజ్ చేయగా ఫస్ట్ టైమ్ రిలీజ్ చేసినప్పుడు కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది.

Also Read : Actress Kasturi : తెలుగు రాజకీయాల్లోకి నటి కస్తూరి.. ఏ పార్టీ అంటే..?

కాగా ఈ సినిమాకు  సీక్వెల్ చేయాలని దర్శకుడు తరుణ్ భాస్కర్ ను ప్రేక్షకులు ఎప్పటినుండో కోరుతున్నారు. హీరో విశ్వక్ సేన్ కూడా ఈ నగరానికి ఏమైంది 2 చేయాలని ఉందని అనేక మార్లు ప్రకటించాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా త్వరలో ఈ సినిమా చేస్తాను అని చెప్పాడు కానీ కార్యరూపం దాల్చలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం. ఈ నగరానికి ఏమైంది 2కు శ్రీకారం చుట్టబోతున్నారు. కాగా ఈ సిక్వెల్ ను ’35 చిన్న కథకాదు’ అనే చిత్రాన్ని నిర్మించిన ఎస్ ఒరిజినల్స్ నిర్మాత సృజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సీక్వెల్ లో ఫస్ట్ పార్ట్ లో ఉన్న గ్యాంగ్ ను తీసుకుంటారా లేదా మరో కొత్త గ్యాంగ్ తో వస్తారా. హీరోగా విశ్వక్ సేన్ ను తీసుకుంటారా లేక ఆ ప్లేస్ ను మరో హీరో రీప్లేస్ చేస్తాడా అని చూడాలి.

Show comments