ENE 2: యూత్‌ఫుల్ కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ (ENE 2) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా 2018లో మొదటి పార్ట్ తీస్తున్న సమయంలో ఒక నిర్మాత తమను తీవ్రంగా అవమానించిన విషయాన్ని ఈ గ్యాంగ్ బయటపెట్టింది.
‘ఈ నగరానికి ఏమైంది’ ఫస్ట్ పార్ట్ షూటింగ్ టైంలో వీరంతా ఇండస్ట్రీకి కొత్తవాళ్లు కావడంతో అప్పట్లో చాలా విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నారట. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ.. “మేము పార్ట్ 1 చేస్తున్నప్పుడు ఒక నిర్మాత మా నలుగురిని చూసి, ‘మీ మొహాలను పోస్టర్ మీద వేస్తే అసలు థియేటర్‌కు జనాలు వస్తారా?’ అని ముఖం మీదే అడిగారు” అని వాళ్లు వెల్లడించింది. ఆ నిర్మాత అన్న మాటలను తాము ఎంతో సీరియస్‌గా, ఛాలెంజ్‌గా తీసుకున్నామని తెలిపారు. సినిమా విడుదలై యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుని కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో, నాడు అవమానించిన ఆ నిర్మాత అంచనాలను తాము తప్పు అని నిరూపించామని ఈఎన్ఈ గ్యాంగ్ గర్వంగా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సినిమా సాధించిన విజయం చూసి అదే నిర్మాత కూడా ఎంతో సంతోషించారని వారు వివరించారు.

