Site icon NTV Telugu

Kaantha : బయోపిక్కా..అబ్బే అవకాశమే లేదట!

Dulquer Salmaan Kantha

Dulquer Salmaan Kantha

దుల్కర్ సల్మాన్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కాంత అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో మరో నటుడు, దర్శకుడు అయిన సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్, టీజర్ కంటెంట్ చూసిన తర్వాత, ఇది ఏదో మహానటి లాంటి కంటెంట్‌లానే ఉంది, జెమినీ గణేషన్ పాత్ర ఛాయలు కనిపిస్తున్నాయి అనే ప్రచారం జరిగింది. అయితే, మరో అడుగు ముందుకు వేసి, ఏకంగా ఇది ఒక తమిళ సూపర్ స్టార్ బయోపిక్ అనే ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఎం.కె.త్యాగరాజ భాగవతార్ అనే తమిళ మొట్టమొదటి సూపర్ స్టార్ బయోపిక్ అనే ప్రచారం మొదలైంది.

Also Read :Hema Malini: నా భర్త చనిపోయాడనే చేసే ప్రచారం క్షమించరానిది!

వాస్తవానికి, ఇదే విషయాన్ని తెలుగు ప్రమోషన్స్ కోసం వచ్చిన దర్శకుడిని అడిగితే, “ఇది ఒక్కరి కథ కాదని” ఆయన చెప్పుకొచ్చారు. తాను చిన్నప్పటి నుంచి తమిళనాడు, చెన్నైలో ఉన్న స్టూడియోల్లో జరిగిన విషయాలను విన్నదాని బట్టి ఒక కొత్త కథ రాసుకున్నానని, ఇది ఒక్కరి జీవితం నుంచి ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నది కాదని అన్నారు. అనేక సంఘటనల సమాహారంగా ఈ సినిమా ఉంటుందని, ఆ సంఘటనలు ఒక్కొక్క హీరోతో ఒక్కొక్క సందర్భంలో జరిగాయని, అందులో కొంతమంది తెలుగు హీరోలు కూడా ఉండి ఉండవచ్చు అని ఆయన అన్నారు.

Also Read :Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు!

తన మేధస్సు నుంచి పుట్టిన కథే తప్ప బయోపిక్ గానీ, రియల్ ఇన్సిడెంట్స్ గానీ లేవని, ఒకటి రెండు సందర్భాలను మాత్రమే తాను విన్నవి సినిమాకి వాడుకున్నానని, మిగతాదంతా తన క్రియేటివ్ వర్క్ అని చెప్పుకొచ్చారు. అయితే, ఈ విషయం తెలియని తమిళ మీడియా మాత్రం ఇది ఫలానా హీరో కథ, ఇది ఫలానా హీరో బయోపిక్ అంటూ ప్రచారం చేస్తోంది. అది నిజమేనని అనుకుని తెలుగు మీడియా కూడా కొంతవరకు రీసెర్చ్ చేయకుండా దాన్ని క్యారీ ఫార్వార్డ్ చేస్తున్నారు.

Exit mobile version