మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. దీపావళి కానుకగా ఈ నెల అక్టోబర్ 31న పాన్ ఇండియా బాషలలో వరల్డ్వైడ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి పూర్తి డ్రామా థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించినట్టు ట్రైలర్ ను చుస్తే తెలుస్తోంది. ఈ చిత్రంలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.
కాగా లక్కీ ఈ సినిమాను అక్టోబర్ 31న అమావాస్య కావదంతో ఒకరోజు ముందుగా ప్రీమియర్ షోలు వేస్తామని నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేసేసాడు నిర్మాత నాగావంశి. ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రీమియర్ షోలు వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 100కి పైగా ప్రీమియర్ షోలను అక్టోబర్ 30న సాయంత్రం 6 గంటల నుండి ప్రదర్శిస్తున్నట్టు మేకర్స్ వెల్లడిస్తూ అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్ సర్కిల్స్ లో ఇన్ సైడ్ పాజిటివ్ రిపోర్ట్స్ చెప్తున్నారు. దీంతో ‘లక్కీ భాస్కర్’ చిత్ర ప్రీమియర్లకు భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీపావళికి 4 సినిమాలు రిలీజ్ కానుండగా ఆడియెన్స్ ఫస్ట్ ఛాయిస్ లక్కీ భాస్కర్ గా ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమాకు జివి.ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు.