Drishyam3 Telugu : దృశ్యం 3 తెలుగు ట్రైలర్ చూశారా.. జార్జికుట్టి పోలీసులకు దొరికేసాడా?

Drishyam 3

Drishyam 3

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన సంచలన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘దృశ్యం’ . జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన మొదటి రెండు భాగాలు పాన్ ఇండియా భాషల్లో రిలీజై  సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఇప్పుడు ఈ క్రేజీ ఫ్రాంచైజీ నుండి రాబోతున్న మూడవ భాగం దృశ్యం 3 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 21న ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

 మొదటి రెండు భాగాలలో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం జార్జికుట్టి చేసిన తెలివైన ఎత్తుగడలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అయితే ‘దృశ్యం 3’ ట్రైలర్ చూస్తుంటే గతం మళ్ళీ అతడిని వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. “పోలీసులు మరియు సొసైటీలో ఉన్న కొందరికి ఈ  కేసులో అసలు నిజం ఏంటో తెలుసు” అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమై ఎమోషన్ ను క్యారీ చేస్తూ సస్పెన్స్ ను మైంటైన్ చేస్తూ క్యూరియాసిటీ పెంచింది. కొత్త రహస్యాలు, జార్జికుట్టి తెలివితేటలు మరియు ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ట్రైలర్ చాలా బాగుంది. గతంలో ‘దృశ్యం’ మొదటి రెండు భాగాలు తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించాయి. అయితే ఈసారి ‘దృశ్యం 3’ నేరుగా డబ్బింగ్ వెర్షన్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. మోహన్ లాల్ స్వయంగా తెలుగు డబ్బింగ్ చెప్పిన దృశ్యం 3 హిట్ టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.