దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రస్తుతం బాక్సాఫీస్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఐపీఎల్ హడావుడి ముగియడంతో తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలు ఊపిరి పీల్చుకున్నాయి. థియేటర్లకు ప్రేక్షకులు మళ్లీ క్యూ కడుతున్నారు. ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం ‘దృశ్యం 3’, తమిళ చిత్రం ‘కరుప్పు’ చిత్రాలకు ఆడియన్స్ నుండి ఆశించిన స్థాయిలో కొంత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్‌గా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాయి.
ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ ‘దృశ్యం 3’ ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి తన బ్రాండ్ పవర్‌ను నిరూపించుకుంది. ఇక కథ పరంగా అంత గొప్పగా ఏమీ లేదనే విమర్శలు ఎదుర్కొన్న సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రం ఏకంగా రూ. 300 కోట్ల మార్కును దాటి కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కంటెంట్‌తో సంబంధం లేకుండా కేవలం క్రేజ్ సరైన టైమ్ లో రిలీజ్ కావడం ఈ సినిమాలకు కలిసొచ్చాయి. ఇప్పుడు అందరి కళ్ళు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’పైనే ఉన్నాయి. గడచిన ఐదు నెలలుగా టాలీవుడ్‌లో సరైన భారీ కమర్షియల్ హిట్ లేక టాలీవుడ్ ఈగర్ గా ఎదురుచూస్తుంది. చిన్న సినిమాలు అడపా దడపా మెరిసినా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే అసలైన సాలిడ్ బ్లాక్‌బస్టర్ కోసం థియేటర్లు, బయ్యర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 4న భారీ అంచనాలతో ‘పెద్ది’ థియేటర్లలోకి రాబోతోంది. పొరుగు ఇండస్ట్రీల ట్రెండ్‌ను బట్టి చూస్తే ఈ చిత్రానికి థియేటర్లలో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఐదు నెలల టాలీవుడ్ సక్సెస్ కరవును తీర్చి, రామ్ చరణ్ ‘పెద్ది’తో ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ సక్సెస్ అందిస్తాడో లేదో చూడాలి.
