NTV Telugu Site icon

DoubleISMART: డబుల్ ఇస్మార్ట్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏంటంటే..?

Untitled Design 2024 08 14t131131.510

Untitled Design 2024 08 14t131131.510

ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు వీరిద్దరు. అటువంటి సక్సెస్ ని మరోసారి చూసేందుకు మూడేళ్ళ తర్వాత మరోసారి కలిశారు రామ్, జగన్నాథ్‌. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి స్వయంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ పేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Also Read : CommitteeKurrollu: అదరగొడుతున్న కమిటీ కుర్రోళ్ళు 5 రోజుల కలక్షన్స్ ఎంతంటే..?

భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమాలు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డబుల్ ఇస్మార్ట్ టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు చిత్ర నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరగా అందుకు అనుమతులు ఇచ్చింది. దాదాపు 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ కు ప్రతి టికెట్ పై 35 రూపాయలు పెంచుకునే విధంగా స్పెషల్ జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. మొదటి 10రోజులు మాత్రమే పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. మరోవైపు డబుల్ ఇస్మార్ట్ కు పోటీగా రిలీజ్ కాబోతున్న మిస్టర్ బచ్చన్ అధిక రేట్లు కోసం అప్లై చేసిందో లేదో ఇక క్లారిటి లేదు. ఇటు తెలంగాణలో మాత్రం సాధారణ ధరలకే ఈ సినిమా ప్రదర్శించనున్నారు. అందుకు సంభందించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. ఎన్నో తర్జన భర్జనలు,పంచాయతీలు, నష్ట పరిహారాల చర్చల అనంతరం డబుల్ ఇస్మార్ట్ ను నైజాంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి పంపిణి చేస్తున్నాడు.

Show comments