NTV Telugu Site icon

Double Ismart Trailer: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రిలీజ్.. సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు

Double Ismart

Double Ismart

Double Ismart Trailer: డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్​ పోతినేని కాంబోలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ మూవీ హిట్ కొట్టడంతో డబుల్ ఇస్మార్ట్‌పై అభిమానుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కాగా, రామ్​ పోతినేని యాటిట్యూడ్, కామెడీని డైరెక్టర్ ట్రైలర్ లో బాగా చూపించారు. అతడి మేనరిజం అదుర్స్ అనేలా ఉంది. రామ్ పోతినేనిపై విలన్స్ ప్రయోగాలు చేస్తున్నట్లు ఇందులో పూరి జగన్నాథ్ చూపించారు.

Read Also: Love Jihad: “లవ్ జిహాద్‌”కి పాల్పడితే జీవిత ఖైదు.. కొత్త చట్టం తెస్తామన్న హిమంత..

ఇక, ‘ఇప్పుడు నా బ్రెయిన్.. నీ బ్రెయిన్‌లోకి వెళ్లబోతుంది’ అంటూ సంజయ్ దత్ డైలాగ్ చెప్పి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. లాస్ట్ లో శివలింగం ముందు చేసిన ఫైటింగ్ సీన్ హైలైట్ గా కనిపిస్తుంది. అయితే, ఈ మూవీలో హీరోయిన్‌గా కావ్యా థపర్, విలన్‌గా సంజయ్ దత్ యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ ను మణిశర్మ అందిస్తున్నారు. ఈ మూవీ యూనిట్ విశాఖలో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొంది. డబుల్ ఇస్మార్ట్ సినిమాని పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించగా.. చార్మితో క‌లిసి పూరి జ‌గ‌న్నాథ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Show comments