NTV Telugu Site icon

Double ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ట్రిపుల్ ఇస్మార్ట్?

Double Ismart

Double Ismart

Double ismart First Review out: ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇస్మార్ట్ శంకర్ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ అభిమానులు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్‌లు, టీజర్ మరియు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 15న థియేటర్లలో డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డబుల్ డోస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సెన్సార్ బోర్డు నుండి ‘ఎ’ సర్టిఫికెట్ లభించింది.

Nagarjuna: శోభితా ధూళిపాళ చాలా హాట్‌గా ఉంది.. నాగార్జున షాకింగ్ కామెంట్స్ వైరల్

రన్ టైం వచ్చేసి 2 గంటల 42 నిమిషాలుగా లాక్ చేశారు. ఇక సెన్సార్ టాక్ పాజిటివ్‌గా వచ్చినట్టుగా చెబుతున్నారు. పూరి ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడని అంటున్నారు. రామ్ పూరీ కాబో అదిరింది అని మరోసారి హిట్ పడొచ్చని తెలుస్తోంది. దానైకి తోడు అయితే.. ఈ మూవీ క్లైమాక్స్‌లో ఒక ఊహించని ట్విస్ట్ ఉంటుందనే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. దీంతో.. ఆ ట్విస్ట్‌ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. పూరి ఈ సినిమాకు మరో సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? త్రిపుల్ ఇస్మార్ట్ అనౌన్స్ చేస్తాడా? అనేది.. సినిమా రిలీజ్ అయితేగానీ చెప్పలేం. ఈ మధ్య ప్రతి సినిమాకు రిజల్ట్‌తో సంబంధం లేకుండా సీక్వెల్ అనౌన్స్ చేసేస్తున్నారు మూవీ మేకర్స్. సినిమా హిట్ అయితే సీక్వెల్ చేయవచ్చు.. లేదంటే లైట్ తీసుకోవచ్చు.. అనేది మేకర్స్ ప్లాన్. ఇప్పుడు పూరి కూడా ఇదే ఫార్మాట్‌లో రాబోతున్నట్టున్నాడు. కానీ డబుల్ ఇస్మార్ట్ రిజల్ట్ మాత్రం పూరితో పాటు రామ్‌కు చాలా కీలకమనే చెప్పాలి. మరి ఈసారి పూరి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి

Show comments