NTV Telugu Site icon

Vishal: విశాల్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు కీలక ప్రకటన

Vishal Madaha

Vishal Madaha

తాజాగా తమిళ ‘మధగజరాజా’ ప్రమోషన్‌లో విశాల్ పరిస్థితి చూసి చాలా మంది షాక్ అయ్యారు. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మధగజరాజా’ దాదాపు 12 ఏళ్ల తర్వాతవిడుదలవుతోంది. దీని ప్రమోషనల్ ఈవెంట్ నిన్న చెన్నైలో జరిగింది. అందులో పాల్గొన్న విశాల్ ఆరోగ్యం చాలా విషమించింది. మైక్ చేతిలో పట్టుకుని మాట్లాడలేకపోయాడు, ఆయన చేయి వణుకుతోంది. విశాల్ ప్రసంగం ముగించిన తర్వాత, హోస్ట్ మాట్లాడుతూ “విశాల్‌కి వైరల్ ఫీవర్ ఉంది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కి జ్వరం ఉన్నా ఆయన వచ్చారు’’ అని పేర్కొన్నారు. వణుకుతున్న చేతులతో విశాల్ మాట్లాడుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

Toxic : జనవరి 8న యష్ టాక్సిక్ అప్ డేట్.. ఫోటోతో కన్ఫాం చేసిన మేకర్స్

విశాల్ మళ్లీ పాత ఫామ్‌లోకి రావాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. విశాల్, వరలక్ష్మి, అంజలి, సంతానం, సోనూసూద్ తదితరులు నటించిన చిత్రం ‘మధగజరాజా’. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ ఆంటోని సంగీతం అందించారు. అయితే విశాల్ కి అసలేం జరిగింది అనే అంశం మీద రకరకాల ప్రచారాలు జరుగుతున్నా క్రమంలో తాజాగా ఆయన టీం స్పందించింది. విశాల్ ఆరోగ్యంపై డాక్టర్ అప్‌డేట్ అందించారు. విశాల్ ప్రస్తుతం వైరల్ జ్వరంతో బాధ పడుతున్నాడు. విశాల్ చికిత్స తీసుకుని, పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచనలు చేశారని వెల్లడించారు.

Show comments