NTV Telugu Site icon

Game Changer : సినిమాలో లేని ‘నానా హైరానా’ సాంగ్.. యాడ్ చేసేది ఎప్పుడంటే..?

Game Chenger

Game Chenger

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్-డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో విడుదలైంది మరియు అనేక కేంద్రాల్లో మొదటి రోజు రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది.గేమ్ ఛేంజర్‌లో సంగీత సంచలనం ఎస్. తమన్ స్వరపరిచిన చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఉంది. ఈ సినిమాలో చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘నానా హైరానా’ సాంగ్ ఈ రోజు విడుదలైన సినిమాలో తొలగించారు మేకర్స్. అంత మంచి సాంగ్ సినిమాలో ఎందుకు లేదా అని ఆరా తీయగా తేలింది.

Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ ఓటీటీ పార్టనర్ ఎవరంటే..?

నానా హైరానా సాంగ్ ను సినిమా ప్రింట్ లో అప్ లోడ్ చేసే టైమ్ లో ఇన్‌ఫ్రారెడ్ చిత్రాల ప్రాసెసింగ్ సమయంలో ఎదురైన టెక్నికల్ ఇష్యుకారణంగా ఫైనల్ కాపీలో యాడ్ చేయలేదట మేకర్స్ . కార్తీక్ మరియు శ్రేయ ఘోషల్ పాడారు మరియు సాహిత్యాన్ని “సరస్వతీపుత్ర” రామజోగయ్య శాస్త్రి రాశారు. లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా అద్భుత స్పందన లభించింది. తీరా సినిమాలో లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సహపడ్డారట. అయితే ఈ ఇష్యు పై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. నానా హైరానా సాంగ్  ను జనవరి 14 నుండి సినిమాలో యాడ్ చేయనున్నారట. ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలో చిత్రీకరించబడిన మొట్టమొదటి భారతీయ పాటగ ‘నానా హైరానా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్‌లో అన్ని భాషలలో 60 మిలియన్లకు పైగా వీక్షణలతో పెద్ద హిట్ అయింది మరియు గత కొన్ని వారాలుగా బెస్ట్ సాంగ్స్ టాప్ లో ట్రేండింగ్ అవుతుంది.

Show comments