టాలీవుడ్ ఇండస్ట్రీ ఎన్నో ఎళ్లుగా అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ హీరోయిన్లలో రమ్యకృష్ణ ఒకరు. 80-90లో తెలుగు సినిమాని ఊపేసిన ఈ గ్లామర్ బ్యూటీ అటు పాజిటివ్ రోల్స్, మరోవైపు నెగటివ్ రోల్స్ కూడా చేసి మెప్పించింది. పాత్ర ఏదైనా దానికి వందశాతం న్యాయం చేయడంలో రమ్యకృష్ణ దిట్ట. అలా తన కెరియర్ లో స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్,మోహన్ బాబు,రజషేకర్ తో అనేక సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకుంది.
Also Read:Aghathiyaa: అంతుచిక్కని రహస్యంతో ‘అఘత్యా’ ట్రైలర్..
రమ్యకృష్ణ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్ లో పలు ముఖ్య పాత్రలలో నటిస్తూ వస్తుంది. అయితే ఈ మద్య కాలంలో ఇండస్ర్టీలోకి వచ్చిన 10ఎళ్లకే ముందు చూపుతో నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు . అలాంటిది ఎప్పటి నుండో ఇండస్ట్రీ ని ఏలుతున్న రమ్యకృష్ణ సంపాదన ఏమాత్రం ఉంటుందో మీరే ఆలోచించండి. అయితే తాజాగా ఈ విషయంపై సోషల్ మీడియలో ఒక వార్త వైరల్ అవుతుంది.
రమ్యకృష్ణ నెలకు ఎంత సంపాదిస్తుంది అనే దానిపై ఓ వార్త వైరల్ అవుతుంది. అయితే రమ్యకృష్ణకు హైదరాబాదులో మూడు జ్యువెల్లరీ షాప్‌లు ఉన్నాయట.దీంతో పాటుగా కేరళలో ఈ అమ్మడుకి మూడు బ్యూటీ పార్లర్‌లు కూడా ఉన్నాయట. వీటికి తోడు ఆమెకు సినిమాల ద్వారా భారీ మొత్తం లోనే పారితోషకాలు అందుకుంటుందట. అలా తన జ్యువెలరీ షాప్స్,బ్యూటీ పార్లర్ ల ద్వారా నెలకు 5 కోట్ల ఆదాయం వస్తుందట. ప్రజంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుంది.