NTV Telugu Site icon

Divya Bharathi : నేను ఎవరితో డేటింగ్‌లో లేను.. కుండ బద్దలు కొట్టిన హీరోయిన్

Divyabharathi

Divyabharathi

ఇండస్ట్రీ ఏదైనప్పటికి నటినటుల మధ్య డెటింగ్,లవ్, విడాకులు అనేది కామన్. ఒకరిని ఇష్టపడటం వారితో కలిసి చెట్టపట్టాలు వేసుకుని తిరగడం, వర్కౌంట్ అవ్వలేదు అని విడిపోవడం, వేరొకరితో మింగిల్ అవ్వడం ఇలాంటి వార్తలు మనం రోజు వింటూనే ఉన్నాం. ఇందులో భాగంగా త‌మిళ మ్యాజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్, గాయని సైంధవి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే జీవీ విడాకులు తీసుకోవ‌డానికి కార‌ణం హీరోయిన్ దివ్య భారతి అనే వార్తలు చాలా రోజులుగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వివాదంపై జీవీ ప్రకాశ్‌తో పాటు దివ్యభార‌తి గ‌తంలోనే స్పందించినప్పటికి.. ముగియ‌క‌పోవ‌డంతో తాజాగా ఇన్‌స్టా వేదిక‌గా పోస్ట్ పెట్టింది దివ్యా భార‌తి.

Also Read: Pawan Kalyan : ‘హరిహర వీరమల్లు’ నుండి మూడో పాటకి డేట్ లాక్ ?

‘నాకు సంబంధం లేని వ్యక్తులు వారి కుటుంబ విషయాల్లో నా పేరును లాగుతున్నారు. జీవీ ప్రకాశ్ కుటుంబ సమస్యలతో నాకు ఎటువంటి అనుబంధం లేదు. నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నేను ఎవరితోనూ డేటింగ్‌లో లేను. ముఖ్యంగా పెళ్లైన‌ వ్యక్తితో అసలు డేటింగ్ చేయను. ఆధారాలు లేకుండా రూమర్స్‌ను పుట్టించొద్దు. ఈ విషయం పై మీకు క్లారిటి ఇవ్వాలని అనుకోలేదు. కానీ కొన్ని రోజులుగా ఈ రూమర్స్ నా సహనాన్ని పరీక్షిస్తున్నాయి. అందుకే రియాక్ట్ అవ్వక తప్పడం లేదు. ఈ గాసిప్‌ల వల్ల నా పేరు చెడిపోతోంది. త‌ప్పుడు వార్తలు సృష్టించడం కంటే సమాజానికి ఉపయోగపడే పనులపై దృష్టి పెట్టండి. నా వ్యక్తిగత జీవితానికి కొంచెం గౌరవించండి. ఈ విషయంపై ఇదే నా మొదటి, చివరి ప్రకటన’ అని దివ్య భార‌తి చెప్పుకోచ్చింది. ప్రజంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.