బాలీవుడ్ బార్బీ దిశా పటాని ఇటీవలే సల్మాన్ ఖాన్ “రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో తనకంటే ఏజ్ లో పెద్దవాడైన సల్మాన్ కు జోడిగా నటించింది. అయితే సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉన్నప్పటికీ దిశా మాత్రం హాట్ ట్రీట్ తో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అందాల బొమ్మ ఎక్కువగా బికినీలో కన్పించి యూత్ హార్ట్ బీట్ పెంచుతూ ఉంటుంది. అందాలు ఆరబోసి కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. తాజాగా మరోసారి వైట్ బికినీలో కన్పించి ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారింది దిశా. ఈ పిక్ తో ఆమె యువకుల గుండెల్లో మంట రాజేసింది.
Read Also : ఫోటోషూట్లతో నెట్టింట్లో జాన్వీ కపూర్ రచ్చ…!
ఆ ఎఫెక్ట్ తో బీచ్ లో సముద్రపు అలల మధ్య తెల్లని బికినీలో ఉన్న దిశా పిక్ ను షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయిపొయింది. పోస్ట్ చేసిన గంటలోపు 6 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతకుముందు స్విమ్ సూట్ లో చేతిలో సీషెల్స్ లో ఉన్న పిక్ ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఆ పిక్ కూడా ఆమె అభిమానులను ఆకట్టుకుంది. సినిమాలతో కన్నా బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం వార్తలతో పాటు ఇలాంటి ఫోటోషూట్లతో భారీ క్రేజ్ సంపాదించుకున్న దిశా ప్రస్తుతం ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ‘కెటినా’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’లో నటిస్తోంది.
A post shared by disha patani (paatni) (@dishapatani)