దేశంలో సంచలనం సృష్టించిన దిశ ఘటనను ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను ఆపాలని దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. కాగా నేడు దిశ తండ్రి అప్పీలుపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సినిమాకు దర్శక, నిర్మాతలు తామేనని ఆనంద్ చంద్ర, అనురాగ్ న్యాయస్థానానికి తెలిపారు. సినిమా టైటిల్ ‘ఆశ ఎన్ కౌంటర్’ గా మార్చినట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏప్రిల్ 16న ‘ఏ సర్టిఫికెట్’ ఇచ్చినట్లు తెలిపారు. సెన్సార్ సర్టిఫికెట్ ను సవాల్ చేసేందుకు వీలుగా వారం రోజులు విడుదల ఆపుతామని దర్శక, నిర్మాతలు విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు సినిమా విడుదలను రెండు వారాలు ఆపాలని ఆదేశించింది. దిశ తండ్రి అప్పీలుపై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.
దిశ ఎన్ కౌంటర్: రెండు వారాలు ఆపాలని హైకోర్టు ఆదేశం
