మిర్చి సినిమాతో రైటర్ నుండి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కొరటాల శివ. ఇక ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ భరత్ అనే నేను తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ టాలీవుడ్ టాప్ దర్శకుల లిస్ట్ లో చేరాడు కొరటాల శివ. ఆ టైమ్ లో శివ తో సినిమా చేసేందుకు టాలీవుడ్ హీరోలు ఎదురు చూశారంటే అతిశయోక్తి కాదు. కేవలం నాలుగు సినిమాలతోనే స్టార్ దర్శకుడు అయ్యాడు. కానీ అదంతా ఒకప్పుడు. కేవలం ఒకే ఒక ప్లాప్ కొరటాల కెరీర్ ను అమాంతం కింద పడేసింది.
Also Read : Coolie : అనిరుధ్.. ఎదో చేస్తాడనుకుంటే.. ఎదో చేసాడు
మెగా స్టార్ చిరు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలు మధ్య వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఒక్క ప్లాప్ తో కొరటాలతో సినిమా చేసేందుకు ఎవరు సుముఖత చూపలేదు. కానీ యంగ్ టైగర్ ఛాన్స్ ఇచ్చాడు. దేవర సినిమాతో కొరటాల శివ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. సుపర్ హిట్ తో పాటు భారీ వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. కానీ ఇప్పుడు శివకు మరోసారి హీరోల కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం శివతో సినిమా చేసేందుకు హీరోలు ఎవరు లేరు. స్టార్ హీరోలు ఎవరు మరో రెండు సంవత్సరాలు ఖాళీగా లేరు. నాని, విజయ్ లైనప్ ఫుల్ అయింది. అంతకంటే చిన్న హీరోలతో సినిమా చేయడానికి కొరటాల ఆసక్తిగా లేడు. చేతులో ఉన్న ఒకే ఒక సినిమా దేవర 2. కానీ ఎప్పుడు మొదలు అవ్వుదో తెలీదు. అసలు మొదలు అవుద్దో లేదో కూడా తెలీదు. ఇంక చేస్తే సీనియర్ హీరోలతోనే చేయాలి. మరి కొరటాలకు ఛాన్స్ ఇచ్చేది ఎవరో.
