NTV Telugu Site icon

భీమ్లా నాయక్ కు భలే కలిసొచ్చింది!

Director Trivikram Enters The Field For Pawan

రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్, రానా మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కు సంబంధించిన మేకింగ్ గ్లిమ్స్ విడుదలైన దగ్గర నుండి ఫిల్మ్ నగర్ లో కొత్త చర్చ మొదలైంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి దర్శకుడు సాగర్ కె చంద్ర. అయితే మేకింగ్ వీడియోలో ప్రధానంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడేమిటనే సందేహం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ మలయాళ రీమేక్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొద్దిపాటి మార్పులు చేర్పులు చేయడంతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దీనికి రచన చేశారు.

Read Also : ‘కిరాతక’ సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే…

హారిక అండ్ హాసిని, సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు ఆయనకు సొంత బ్యానర్స్ లాంటివి. దాంతో ఆ బ్యానర్స్ లో తెరకెక్కే సినిమాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారు. దీనికంటే బాగా కలిసి వచ్చిన అంశం ఏమంటే… ముందు అనుకున్నట్టు ఎన్టీయార్ సినిమా కాకుండా త్రివిక్రమ్ మహేశ్ బాబుతో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. సో… అది అయ్యేంతవరకూ త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కదు. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్‌ సినిమా మీద కాస్తంత దృష్టి పెట్టి, బెటర్ అవుట్ పుట్ కు తనవంతు కృషి చేయాలని త్రివిక్రమ్ అనుకున్నారట. రానా దగ్గుబాటికి సీన్ ను ఎక్స్ ప్లెయిన్ చేయడం మొదలుకొని, సీన్ ఎలా వచ్చిందో హీరోలతో చర్చించే పని కూడా త్రివిక్రమే పెట్టుకుంటున్నాడంటే… ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కు ఆయన దర్శకత్వ పర్యవేక్షకుడని అనడానికి వెరవక్కర్లేదు. మరి 2018 సంక్రాంతి కానుకగా వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చేదు జ్ఞాపకాలను, 2022 సంక్రాంతిలో వచ్చే భీమ్లా నాయక్ తుడిపేస్తాడేమో చూడాలి.