అగ్ర దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం “పుష్ప” చిత్రీకరణను ఇటీవలే తిరిగి ప్రారంభించారు. కానీ మళ్ళీ తాజాగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. సుకుమార్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడని సమాచారం. అందుకే ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. సుకుమార్ యాంటీబయాటిక్స్ తో పాటు ఇతర ఇంగ్లిష్ మందులకు దూరంగా ఉన్నాడు. ఆయన గత కొన్నేళ్లుగా హోమియోపతిని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు కూడా వైరల్ ఫీవర్ కు ఆయన హోమియోపతినే వాడుతున్నట్లు సమాచారం.
Read Also : ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు వాడే… “ఎనిమీ” టీజర్
సుకుమార్ పూర్తిగా కోలుకున్న తర్వాత అల్లు అర్జున్ షూట్ తిరిగి ప్రారంభించాలనుకున్నాడు. మొదటి భాగం “పుష్ప” షూటింగ్ మొత్తాన్ని జూలై చివరి నాటికి పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ సుకుమార్ అనారోగ్యం శరవేగంగా జరుపుకుంటున్న సినిమా షూటింగ్ కు బ్రేక్ వేసింది. “పుష్ప” మొదటి భాగం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది. అల్లు అర్జున్ “పుష్ప 1” చిత్రీకరణ పూర్తి చేసి శ్రీరామ్ వేణు దర్శకత్వంలో “ఐకాన్”ను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నాడు. “ఐకాన్” పూర్తి చేశాక మళ్ళీ సుకుమార్ తో బన్నీ “పుష్ప 2” ప్రారంభించాల్సి ఉంటుంది.