NTV Telugu Site icon

Shankar: గేమ్ చేంజర్ స్టోరీ లీక్ చేసేసిన శంకర్

Shankar Speech

Shankar Speech

గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శంకర్ మాట్లాడుతూ… ముఖ్యఅతిథిగా వచ్చిన పవన్ కళ్యాణ్ కి ముందుగా థాంక్స్ చెప్పారు. అలాగే రాజమండ్రి వాసులందరికీ నమస్కారం చెబుతూ వచ్చిన అతిథులందరికీ థాంక్స్ చెప్పారు. నేను ఈ 30 సంవత్సరాలలో ఒక 14 సినిమాలు చేశాను. ఒకటి కూడా నేరుగా తెలుగు సినిమా చేయలేదు. కానీ నేను చేసిన అన్ని సినిమాలు డబ్బింగ్ అయి తెలుగులో రిలీజ్ అయ్యాయి. అలా డబ్బింగ్ వచ్చిన సినిమాలకే మీరు ఎంతో సపోర్టు ఇచ్చారు. అంత ప్రేమ చూపించారు. నేను తిరిగి మీకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఒక స్ట్రెయిట్ సినిమా చేయాలని చాలా సంవత్సరాలు ప్రయత్నం చేశాను. అది ఇప్పటికీ కుదిరింది. దానికి రాజు గారికి, రామ్ చరణ్ గారికి ఇద్దరికీ థాంక్స్.

SJ Suryah: ఆయన పదవి కోసమో పవర్ కోసం కాదు మీ కోసమే బతుకుతున్నారు!

ఈ సినిమా ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా. అంతా తెలుగు సినిమాలా ఉండాలని అందరూ తెలుగు నటులను, తెలుగు టెక్నీషియన్లను, అన్ని ఆంధ్రా లోకేషన్స్ ఫాలో అయ్యి ఈ సినిమా చేసాం. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక కలెక్టర్ కి ఒక మినిస్టర్ కి జరిగే వార్. ఆ హీరో క్యారెక్టర్ వెనుక ఒక స్టోరీ ఉంటుంది.. అది ఎలా వచ్చి మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుందని సినిమాలో చూడాలి. అందులో రామ్ చరణ్ గారు ఒక్కొక్క క్యారెక్టర్ లో నటించలేదు.. ఆయన చూస్తే ఎంతో రియల్ గా అనిపించేలా నటించారు. ఆయనకు నా ధన్యవాదాలు. ఈ సినిమాలో నటించిన అంజలి, కీయారా అద్వానీ, శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్ జె సూర్య మిగతా అందరూ నటీనటులకు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి, మిగతా టెక్నీషియన్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు… అంటూ ఆయన ముగించారు.

Show comments