Site icon NTV Telugu

Nelson : టాలీవుడ్ హీరోలతో మాసివ్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న నెల్సన్

Nelson Dilip

Nelson Dilip

తమిళ స్టార్ దర్శకులలో నెల్సన్ దిలీప్ కుమార్ ముందు వరసలో ఉంటారు. కోకోకోకిలా సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నెల్సన్ ఫస్ట్ సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు. ఇక శివకార్తికేయన్ హీరోగా వచ్చిన డాక్టర్ తో స్టార్ దర్శకుల లిస్ట్ లోకి చేరుకున్నాడు నెల్సన్. దాంతో పిలిచి మరి ఛాన్స్ ఇచ్చాడు స్టార్ హీరో విజయ్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన బీస్ట్ భారీ అంచనాల మధ్య విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. బీస్ట్ ప్లాప్ అవడంతో  వెంట్లనే రజనీతో జైలర్ సినిమాను డైరెక్ట్ చేసి తన డైరెక్షన్ పవర్ చూపించాడు నెల్సన్. వరుస ప్లాప్స్ లో ఉన్న సూపర్ స్టార్ రజనీకి జైలర్ రూపంలో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం జైలర్ 2 ను డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడు.

Also Read : Hebah Patel : హెబ్బా పటేల్ నుండి బ్యాక్ టు బ్యాక్ మూవీస్

ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో నెక్ట్స్ సినిమాపై ఫోకస్ చేశాడు నెల్సన్. ఆయితే ఈసారి తమిళ హీరోలతో కాకుండా తెలుగు హీరోతో సినిమా చేయాలని చూస్తున్నాడు నెల్సన్. టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఎప్పటినుండో చూస్తున్నాడు. ఎన్టీఆర్ కు కథకూడా చెప్పడం అక్కడ గ్రీన్ సిగ్నల్ కూడా రావడం జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుందని వార్తలు కుడా వచ్చాయి. కాని మళ్ళి ఎందుకో ఈ సినిమా హోల్డ్ పెట్టినట్టు ఆ మధ్య టాక్ వినిపించింది. అయితే నెల్సన్ దిలీప్ కుమార్ సైలెంట్ గా భారీ స్కెచ్ వస్తున్నాడని ఒకరు కాదు ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలతో భారీ మాస్ మల్టీస్టారర్ ను తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఎన్టీఆర్ తో పాటు మరొక హీరోతో కలిపి ఈ సినిమా చేస్తారా లేదా మరెవరితోనా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version