Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?

Nag Ashwin

Nag Ashwin

‘కల్కి’ రిలీజ్ అయి రెండేళ్లయినా, కర్ణుడి రోల్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్, దీపికా పడుకోణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటించినటువంటి ‘కల్కి’ 2024 జూన్ లో రిలీజ్ అయి పాన్ ఇండియా హిట్ అయింది. వరల్డ్ వైడ్ 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంత హిట్ అయినా సరే, కర్ణుడి పాత్రను డైరెక్టర్ నాగ్ అశ్విన్ చూపించిన విధానాన్ని తప్పుపడుతూనే ఉన్నారు. ‘లెనిన్’ రిలీజ్ తర్వాత ఈ కాంట్రవర్సీ మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకాలం మౌనంగా ఉన్న నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో మీరే చూడండి. ‘కల్కి’ని మైథలాజికల్ ఫ్యాంటసీ మూవీగా తీశాడు నాగ్ అశ్విన్. సినిమా మొదట్లో, క్లైమాక్స్‌లో మహాభారతాన్ని టచ్ చేశాడు. అశ్వత్థామ పాత్ర మాత్రం సినిమా మొత్తం కంటిన్యూ అవుతుంది. విజయ్ దేవరకొండను అర్జునుడిగా, ప్రభాస్‌ను కర్ణుడిగా చూపించాడు. డైరెక్టర్ చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో, నాగ్ అశ్విన్ రెండేళ్లుగా కల్కి 2తో బిజీగా ఉంటూ ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశాడు.

కర్ణుడి పాత్ర చిత్రీకరణపై వచ్చిన విమర్శలు సమసిపోయాయి అనుకుంటే, ‘లెనిన్’లో విలన్ రోల్ క్యారెక్టరైజేషన్ కల్కిని మళ్లీ కాంట్రవర్సీలోకి లాగింది. ‘లెనిన్’లో ప్రమోద్ పంచు విలన్ గా క్రూరమైన పాత్రలో కనిపించాడు. ఓ నెటిజన్ అయితే, “కర్ణుడిని ఇలాగే చూపించాలి, కానీ కల్కిలో కర్ణుడిని ఎక్కువగా చూపించారు” అంటూ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి మరోసారి తెరలేపాడు. ‘కల్కి’ రిలీజ్ టైమ్‌లో విమర్శలకు స్పందించని నాగ్ అశ్విన్, ఈసారి ఘాటుగా కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఇన్‌స్టా వేదికగా నాగ్ అశ్విన్ సుదీర్ఘంగా స్పందిస్తూ.. రచయిత వివేక్ దేబ్రాయ్ ఇంగ్లీష్‌లోకి అనువదించిన ‘మహాభారతం’ పుస్తకంలోని ఓ పేజీని షేర్ చేశాడు. నెటిజన్ పోస్ట్‌కు రిప్లై ఇస్తూ.. ద్రోణపర్వంలో కర్ణుడి గొప్పతనం గురించి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడని, ఓసారి ఆ పుస్తకాన్ని చదవమని సలహా ఇచ్చాడు. లేదంటే, “అర్జునుడితో శ్రీకృష్ణుడు మాట్లాడేటప్పుడు కర్ణుడిని ఎన్ని సార్లు ప్రశంసించాడో గూగుల్ చేసి తెలుసుకోండి” అంటూ రిప్లై ఇచ్చాడు నాగ్ అశ్విన్. పురాణాలపై తనకు ఎంతో గౌరవం ఉందని, ఏం చేస్తున్నానో తనకు తెలుసని అన్నాడు.

‘కల్కి’ టాపిక్ వచ్చినప్పుడల్లా లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. గతంలో ఒక సభలో పాల్గొన్న అనంత్ శ్రీరామ్, కల్కి సినిమాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. పరోక్షంగా ‘దానవీర శూరకర్ణ’ను, ఈ సినిమాను డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్‌ను విమర్శించాడు. కల్కి సినిమాలో కర్ణుడిని హీరోగా చూపించడాన్ని వ్యతిరేకించాడు అనంత్ శ్రీరామ్. “కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాల నుంచి కల్కి వరకు కర్ణుడి పాత్రకు గొప్పదనం అద్దడం చూసి సిగ్గుపడుతున్నాను” అన్నాడు అనంత్ శ్రీరామ్.

కొన్నేళ్ల క్రితం సినిమా అంటే అది ‘దానవీర శూరకర్ణే’. ఈ మూవీని ఎన్టీఆర్ డైరెక్ట్ చేస్తూ, కర్ణుడిని హీరోగా చూపించాడు. ఆ మూవీ ఏమిటో కనిపెట్టలేని వాళ్లకు అనంత్ శ్రీరామ్ తన స్పీచ్‌లో హింట్ కూడా ఇచ్చాడు.. “అప్పటి చిత్ర దర్శకుడు, ఇప్పటి సినిమా నిర్మాతలు ఇదే కృష్ణా జిల్లా వాళ్లు” అన్నాడు రచయిత. ‘డీవీఎస్ కర్ణ’ ఎన్టీఆర్ డైరెక్షన్‌లో తెరకెక్కితే, ‘కల్కి’ని అశ్విని దత్ నిర్మించాడు. కల్కి రిలీజ్ తర్వాత పురాణాలను వక్రీకరించి కర్ణుడిని హీరోగా చూపించడాన్ని అనంత్ శ్రీరామ్ వ్యతిరేకించాడు.

దీనిపై కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ ఇండైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చాడు. అనువదించిన మహాభారతం పుస్తకాన్ని అమెజాన్‌లో జపనీస్ వాళ్లు ఎక్కువగా చదువుతున్నారని అన్నాడు. ప్రపంచం మొత్తానికి మహాభారతం తెలుసని పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు దర్శకుడు. రీసెంట్ ఇంటర్వ్యూస్ లో కల్కిలో కర్ణుడి పాత్రపై అనంత్ శ్రీరామ్ మరోసారి విమర్శలు గుప్పించగా, లేటెస్ట్‌గా నెటిజన్ ట్వీట్‌తో అందరికీ కలిపి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు నాగ్ అశ్విన్.