NTV Telugu Site icon

Thandel: ‘తండేల్’ పై దర్శకేంద్రుడి రివ్యూ

February 7 (57)

February 7 (57)

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు వేటకు వెళ్లగా.. పాకిస్థాన్‌ కోస్ట్‌ గార్డుకు చిక్కి, రెండేళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఈ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. దీంతో ఈ మూవీ పై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుకున్నట్లుగానే చైతన్య, సాయి పల్లవి తమ నటనతో ప్రేక్షకుల మదిని గెలుచుకున్నారు. ఇక ఇప్పటికే చాలా మంది నటీనటులు కూడా చై యాక్టింగ్ పై ‘తండేల్’ టీం పై ప్రశంసలు కురిపించగా.. తాజాగా టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్ కూడా ఈ మూవీ పై రివ్యూ ఇచ్చారు..

Also Read:Mrunal: గ్యాప్ రాలేదు.. ఇచ్చిందట!

ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటే.. కె.రాఘవేంద్రరావు. ఆయన సినిమాల గురించి రివ్యూలు చాలా తక్కువగా చెబుతుంటారు. ఎంతో నచ్చితేనో, తన స్టైల్‌లో ఉంటేనో తప్ప ఆయన రివ్యూలు ఇవ్వరు. కానీ ఇప్పుడు ‘తండేల్‌’ సినిమాకు తన రివ్యూ ఇచ్చారు.. ‘చాలా రోజులకు ‘తండేల్’ వంటి అద్భుతమైన ప్రేమకథను చూశాను. నాగచైతన్య, సాయి పల్లవి పోటీ పడి నటించారు. చందూ మొండేటి తీసుకున్న కథ.. దాని నేపథ్యం సాహసంతో కూడుకుంది. షాట్ మేకింగ్ పై దర్శకుడి శ్రద్ధ బాగుంది. ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్న గీతా ఆర్ట్స్ కు అభినందనలు’ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇక ఈ ట్వీట్ పై నాగచైతన్య సంతోషం వ్యక్తం చేస్తూ ‘థాంక్యూ సో మచ్ సర్ మీకు సినిమా నచ్చినందుకు సంతోషంగా ఉంది. మీ మాటలు, అభినందనలు నాకెంతో అమూల్యమైనవి’ అని తెలిపాడు.