Director Harish Shankar: కత్తిలాంటి కుర్రాళ్ళు అందరూ కర్నూల్ లోనే ఉన్నారా అనిపిస్తోంది ఇది చూస్తుంటే అని పేర్కొన్న హరీష్ శంకర్ పోలీసు శాఖకి విచ్చేసిన అతిధులకి ధన్యవాదాలు తెలిపాడు. ఆ తర్వాత లిరిస్టులకు, డైలాగ్ రైటర్ కు, రైటింగ్ టీం కి ధన్యవాదాలు తెలిపాడు. మీకు దండం పెడతా అందరూ ఆగస్టు 15 అంటున్నారు కాదు ఆగస్టు 14వ తేదీ సాయంత్రం నుంచే ఏడు గంటలు ఐదు నిమిషాల నుంచి మిస్టర్ బచ్చన్ షోలు మొదలవుతాయి. ఆగస్టు 15 ఉదయం నుంచి మార్నింగ్ షో లు కూడా మొదలవుతాయి అని చెప్పుకొచ్చాడు. మా సినిమా ఒక్కటే కాదు మా గురువుగారు డబ్బులు ఇస్మార్ట్ సినిమా రిలీజ్ అవుతుంది మొహమాట పడకండి రెండు సినిమాలు చూడండి, రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ చేయండి అని పేర్కొన్నారు.. 15వ తేదీ రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. మా సినిమాని నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కానీ శిరీశ్ అన్నకి థాంక్స్ చెప్పాలి ఆయన వల్లే మంచి థియేటర్లు మా సినిమాకి దొరికాయి అని చెప్పుకొచ్చాడు.
Also Read: Raviteja: ఇరగదీయ్యబోతున్నాం తమ్ముళ్లూ.. గెట్ రెడీ
ఫస్ట్ టైం నా కెరియర్లో అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చిన ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్ గారు అని అంటూ నిర్మాత మీద ప్రశంసల వర్షం కురిపించాడు. ఆయన అంత సపోర్ట్ చేయడం వల్లే సినిమా ఇంత వేగంగా పూర్తయింది అని అన్నారు. ఆయన కేవలం డబ్బుంది అని సినిమా నిర్మాణంలోకి రాలేదు సినిమా మీద ఉన్న ఫ్యాషన్ తోనే ఇక్కడికి వచ్చారని అన్నారు. ఫస్ట్ సినిమాకే అద్భుతంగా నటించింది భాగ్యశ్రీ అయితే ఇప్పటికే చాలా దిష్టి తగిలింది అందుకే ఎక్కువ పొగడడం లేదని అన్నాడు. మీడియా మిత్రులు అందరికీ మనవి చేస్తున్నాను నేను మాట్లాడేటప్పుడు మీ మీద కౌంటర్లు వేస్తున్నట్టు ఎవరైనా మాట్లాడితే అది నాకు నచ్చడం లేదు. ఎందుకంటే మీరు వేరు నేను వేరు కాదు. వాళ్లు అలా అంటుంటే నాకు నచ్చడం లేదు. రివ్యూస్ కావాలంటే ఎలా అయినా రాసుకోండి రేటింగ్ కావాలంటే ఎంతైనా వేసుకోండి. కొంతమంది బాధపెడుతున్న వాళ్ళని తప్ప మిగతా వాళ్ళ అందరిని నేను చాలా గౌరవిస్తాను అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.