Buchibabu : ‘మ్యూజిక్’ అనడమే రాని స్థితి నుండి.. రెహమాన్ పక్కన కూర్చునే వరకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్రానికి ఆస్కార్ విజేత, మ్యూజిక్ మేస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా జూన్ 4న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో.. డైరెక్టర్ బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్‌ల మధ్య జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. బుచ్చిబాబు ఈ కథను నరేట్ చేసినప్పుడు రెహమాన్‌కు ఇది కేవలం ఒక నార్మల్ స్పోర్ట్స్ మూవీలా అనిపించలేదట. ఈ స్టోరీలో ఒక మంచి సోల్, ఒక ఆగని ఆవేదన, అలాగే ఒక గొప్ప ఆస్పిరేషన్ కనిపించాయని రెహమాన్ కొనియాడారు. ముఖ్యంగా సినిమాపై బుచ్చిబాబుకు ఉన్న ప్రేమ, నమ్మకం తనకు బాగా నచ్చాయని చెప్పారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. *”సార్, నేను కాకినాడలో పూర్తిగా తెలుగు మీడియంలో చదువుకున్నాను. డిగ్రీ చదువుతున్న రోజుల్లో మీ మ్యూజిక్ వింటూ.. ‘ఒరేయ్ ఏంట్రా ఆ మూజిక్ భలే ఉందిరా’ అని నా ఫ్రెండ్స్‌తో అంటే, వాళ్లు నన్ను ఎగతాళి చేసేవారు. ‘ఒరేయ్ మూజిక్ కాదురా.. మ్యూజిక్ అనాలిరా’ అని నవ్వేవారు. అలా కనీసం ‘మ్యూజిక్’ అనే వర్డ్ కూడా సరిగ్గా పలకడం రాని నేను.. ఈ రోజు మీతో కలిసి వర్క్ చేస్తున్నానంటే దేవుడి బ్లెస్సింగ్. ఇది నా కలలో కూడా ఊహించలేదు సార్”* అని బుచ్చిబాబు అన్నారు. దానికి రెహమాన్ స్పందిస్తూ.. “మీతో కలిసి వర్క్ చేయడం నాకు కూడా బ్లెస్సింగే. రామ్ చరణ్ లాంటి హీరో, ఆయన డ్యాన్సులు, ప్రతి చిన్న నోట్‌కు తగ్గట్టు చేసే కొరియోగ్రఫీ నా మ్యూజిక్‌ను మరింత ఎలివేట్ చేస్తాయి. ఇలాంటి ఎనర్జీ ఉంటే నాకు ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది” అని భరోసా ఇచ్చారు.
Also Read
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!