Martin: వారంలో రిలీజ్.. నిర్మాతపై హైకోర్టును ఆశ్రయించిన దర్శకుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్‌తో ప్రపంచ స్థాయిలో రూపొందుతున్న మార్టిన్ సినిమా గురించి స్వయంగా దర్శకుడు ఎ.పి. అర్జున్ స్వయంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 11న విడుదల కానున్న సినిమా అదే రోజు రిలీజ్ అవుతుందా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. హీరో ధృవ సర్జా, నిర్మాత ఉదయ్ మెహతాతో సహా అందరూ దీనిని పాన్ వరల్డ్ సినిమా అని పిలుస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు వారం రోజుల సమయం ఉండగా చిత్ర దర్శకుడు ఎ.పి.అర్జున్ మార్టిన్ చిత్ర బృందంపై స్వయంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ చిత్ర నిర్మాత ఉదయ్ మెహతాపై మార్టిన్ చిత్ర దర్శకుడు ఎ.పి.అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాకి నేనే డైరెక్టర్ అయినప్పటికీ నా పేరు లేకుండా సినిమా దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్లు కూడా నిర్మాతలు పాటించలేదని ఆయన ఆరోపించారు.
Posani Krihsna Murali : కొండా సురేఖ – అక్కినేని వివాదం.. పోసాని కృష్ణమురళి షాకింగ్ కామెంట్స్
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
ఈ చిత్రానికి దర్శకుడిగా నా పేరు చెప్పకుండా, నేను లేకుండా సినిమాను విడుదల చేయకూడదని, దీంతో నిషేధం విధించాలని కోరుతూ అర్జిన్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. సినిమా నిర్మాణంలో దర్శకుడి పాత్ర కీలకం. దర్శకుడి పేరు ఎత్తివేయాలని, సినిమాను ప్రమోట్ చేయవద్దని ఆదేశించాలని కోరారు. డైరెక్టర్ ఏపీ అర్జున్ తరఫున సీనియర్ న్యాయవాది ఉదయ్ హోళ్ల, ప్రసన్నకుమార్ వాదించారు. ఈక్రమంలో నిర్మాత శ్రీ ఉదయ్ మెహతా, వాసవి ఎంటర్‌ప్రైజెస్‌లకు హైకోర్టు నోటీసు జారీ చేసింది. సినిమా ప్రమోషన్‌లో దర్శకుడిని వదిలిపెట్టకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కన్నడ భారీ బడ్జెట్ చిత్రం మార్టిన్‌పై చిత్రబృందం, అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. చాలా తేదీలు వాయిదా పడి ఇప్పుడు సినిమా రిలీజ్ స్టేజ్‌లో ఉండటంతో నిర్మాత, దర్శకుల మధ్య విబేధాలు హైకోర్టుకు చేరాయి. అయితే కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో సినిమా ప్రమోషన్‌లో నిర్మాత పేరును తొలగించరాదని ఆదేశాలు జారీ చేసింది. సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. కాబట్టి సినిమా విడుదలపై ఎలాంటి ఇబ్బంది లేదనేది స్పష్టం.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..