Site icon NTV Telugu

Tollywood : ఈ శుక్రవారం డైరెక్ట్ రిలీజ్ vs రీ రిలీజ్ సినిమాలు

Tollywood

Tollywood

సమ్మర్ తర్వాత కళ తప్పిన బాక్సాపీసుకు హరి హర వీరమల్లుతో ఓ ఊపు తెప్పించబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జులై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది వీరమల్లు. ఈ వారం గ్యాప్ లో అటు కన్నడ, ఇటు తెలుగు, అటు తమిళ డబ్బింగ్ చిత్రాలు వరుసగా సందడి చేయబోతున్నాయి. కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో నిర్మాతగా ఫ్రూవ్ చేసుకున్న ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. సినిమాపేరు ‘కొత్త పల్లిలో ఒకప్పుడు’. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్ ఉంది. రానా దగ్గుబాటి సమర్పణలో ఈమూవీ జులై 18న థియేటర్లలోకి రాబోతోంది.

Also Read : HHVM : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ మారింది.. ఇదే ఫిక్స్

ఈ ఫ్రైడే తమదే అంటున్నారు ఇద్దరు కన్నడ హీరోలు కిరీటీ అండ్ యువ రాజ్ కుమార్. పారిశ్రామిక వేత్త గాలి జనార్థన్ రెడ్డి కొడుకు కిరీటీ హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. జూనియర్ అంటూ చందన సీమతో పాటు టాలీవుడ్‌లోనూ తన లక్ టెస్ట్ చేసుకోబోతున్నాడు. ఇక శివరాజ్ కుమార్ సోదరుడి కొడుకు యువరాజ్‌ కుమార్‌ కూడా ఎక్కా అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీకి రెడీ అయ్యాడు. ఈ సినిమాను శ్రీ సినీ వెంకటేశ్వర క్రియేషన్స్ రిలీజ్ చేస్తోంది.  ఈ సినిమాలకే స్పేస్ లేదనుకుంటే రీ రిలీజ్ చిత్రాలు కూడా సందడి చేయబోతున్నాయి. సూర్య బర్త్ డేని పురస్కరించుకుని జులై 18న రెండు సినిమాలు విడుదల చేస్తున్నారు. గజినీతో పాటు సూర్య నటించిన సన్నాఫ్ కృష్ణన్‌ను మరోసారి రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇక మోస్ట్ ఎవైటెడ్ రీ రిలీజ్‌గా మారింది ఏ మాయ చేశావే. మాజీ వైఫ్ అండ్ హస్బెండ్ సామ్ అండ్ చైతూ నటించిన ఫస్ట్ మూవీ ఏమాయ చేశావే కూడా జులై 18నే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇవే కాకుండా అడపా దడపా వచ్చే చిన్న చిత్రాలు కూడా రీలీజ్‌ అవుతున్నాయి.

Exit mobile version