Site icon NTV Telugu

MAA: ‘మా’ వాళ్ళకే అవకాశం ఇవ్వమంటున్న మంచు విష్ణు!

Maa

Maa

సోమవారం నుండి సినిమా షూటింగ్స్ బంద్ కావడంతో వరుసగా ఒక్కో శాఖతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రముఖులు, ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్మాతలు, పంపిణీ దారులు, ఎగ్జిబిటర్స్ సమావేశం అవుతూ వస్తున్నారు. మంగళవారం డిజిటల్ ప్రొవైడర్స్ తో సమావేశం అయిన నిర్మాతలు, బుధవారం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గంతోనూ సంప్రదింపులు జరిపారు. అయితే ఆర్టిస్టుల రెమ్యూనరేషన్స్ విషయంలో ‘మా’ సభ్యులు నిర్మాతలకు ఎలాంటి హామీ ఇవ్వనప్పటికీ, నిర్మాతల కష్టానష్టాలపై సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఇదే సమయంలో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా నిర్మాతలకు తనదైన రీతిలో కొన్ని విజ్ఞప్తులు చేశాడు.

read also: Komatireddy Venkat Reddy: బండి సంజయ్‌ ఏమన్నారో తెలియదు.. టచ్‌ లో లేను..!

ముఖ్యంగా సినిమాలలో తెలుగు నటీనటులకు అవకాశం ఇవ్వాలని, కొత్త నటీనటులను ప్రోత్సహించాలని కోరాడు. బయటి నటీనటులను ఒకవేళ తీసుకోవాల్సి వస్తే… వాళ్ళతో ‘మా’ సభ్యత్వం తీసుకునేలా చేయమని తెలిపాడు. నిజానికి ఈ రెండు డిమాండ్స్ ఎంతో కాలంగా ఉన్నాయి! నిర్మాతలతో పరభాషా నటీనటులకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వారు ‘మా’ సభ్యులు కాకపోవడంతో ఈ కార్యవర్గం వారికి ఎలాంటి సాయం చేయలేని పరిస్థితి నెలకొంది. కాబట్టి… వారు తప్పనిసరిగా ‘మా’ సభ్యత్వం తీసుకుంటే… వారి సమస్యలను కూడా ఈ సంస్థ పరిష్కరించే ఆస్కారం ఉంటుంది. ఇదే విషయాన్ని ఓ లేఖ ద్వారా తెలిపి, ‘గిల్ట్ ప్రొడ్యూసర్స్’కు ‘దిల్’ రాజు ద్వారా అందచేసినట్టు మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Exit mobile version