Site icon NTV Telugu

Dil Raju : కోలీవుడ్ స్టార్ హీరోతో దిల్ రాజు సినిమా?

Dil Raju

Dil Raju

తెలుగు చిత్ర పరిశ్రమలోని బడా నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. నిర్మాతగా మాత్రమే కాదు పంపిణీదారనిగా కూడా దిల్ రాజు కింగ్ పిన్. నైజాం వంటి ఎరియాస్ లో థియేటర్స్ ను శాసించగల వ్యక్తి దిల్ రాజు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ గా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో విడుదల చేస్తున్నారు. కానీ నిర్మాతగా దిల్ రాజు ఈ ఏడాది గట్టి ఎదురుదెబ్బ తిన్నాడు. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ ఛేంజెర్ భారీ నష్టాలు తెచ్చింది.

Also Read : RC 17 : సుకుమార్ బిగ్ మిస్టేక్ చేయబోతున్నాడా…?

ప్రస్తుతం దిల్ రాజు చేతిలో విజయ్ దేవరకొండతో ఓ సినిమా తప్ప స్టార్ హీరోల సినిమాలు ఏవి లేవు. ఈ నేపథ్యంలోమరోసారి తమిళ ఇండస్ట్రీవైపు చూస్తున్నాడు దిల్ రాజు. తమిళ స్టార్ హీరో విజయ్ తో  వారసుడు’ సినిమాతో కోలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్నాడు దిల్ రాజు. ఇప్పుడు కోలీవుడ్ మరొక స్టార్ హీరో అయిన అజిత్ కుమార్ తో సినిమా చేయాలని భావిస్తున్నాడట దిల్ రాజు. ప్రస్తుతం అజిత్ – దిల్ రాజు మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. గుడ్ బ్యాడ్ అగ్లీ విజయం తర్వాత అజిత్ తన తదుపరి చిత్రం అధిక్ రవిచంద్రన్‌తో  చేయబోతున్నాడు. ఆ తర్వాత సినిమా కోసం మార్కో దర్శకుడు హనీఫ్ అదేని డైరెక్షన్ లో సినిమా సినిమా కోసం అజిత్ ని సంప్రదించాడు దిల్ రాజు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే రాబోయే ప్రాజెక్ట్‌ను దిల్ రాజు నిర్మిస్తాడు. అయితే అజిత్ ఇటీవల భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడని కోలీవుడ్ వర్గాలలో టాక్ నడుస్తోంది. మరి దిల్ రాజు ఇప్ప్పుడు అజిత్ ను ఎలా సెట్ చేస్తాడో అనే డిస్కషన్ వినిపిస్తోంది.

Exit mobile version