Site icon NTV Telugu

Dil Raju vs Mythri Movie Makers: దిల్ రాజుకు మైత్రీ మార్క్ కౌంటర్?

Dil Raju

Dil Raju

దిల్ రాజు , మైత్రీ మూవీ మేకర్స్ సంస్థల మధ్య పోటా పోటీ వాతావరణం నెలకొంది. అందుకు అనుగుణంగా మైత్రీ మూవీ మేకర్స్ Vs దిల్ రాజు అని కొంతకాలంగా వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త చూస్తూనే ఉన్నాము. పండుగ సమయంలో అయితే వీరిద్దరి మధ్య పోరు జరుగుతూనే ఉండడం సాధారణం అయింది. జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే మరోసారి వీరి మధ్య పండుగ పోరు జరుగనుంది. అసలు విషయం ఏమిటంటే దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన రామ్ చరణ్ తేజ గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సహా మరో సినిమా పోటీలో ఉండగా ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న అజిత్ గుడ్ బాడ్ అగ్లీ సినిమా రంగంలోకి దిగుతుంది.

Puspa Bike: పుష్ప క్రేజ్ మాములుగా లేదుగా.. అభిమాని బైకును భలే మార్చేసాడుగా

ఇప్పటికి డేట్ చెప్పకున్నా జనవరి 10న సినిమా రిలీజ్ చేస్తామని హింట్ ఇచ్చారట. ఇది దిల్ రాజుకు తెలుగు రాష్ట్రాలలో పెద్దగా దెబ్బ వేయకపోయినా తమిళంలో మాత్రం ఇబ్బంది పెట్టే అంశమే. ఎందుకంటే తమిళంలో శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అయినా అజిత్ హీరోగా వస్తున్న సినిమా కంటే గేమ్ చేంజర్ కాస్త తక్కువగానే పరిగణిస్తారు. దానికి తోడు గుడ్ బాడ్ అగ్లీ అనే సినిమాని పూర్తిగా తమిళ సినిమాగానే మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న నేపద్యంలో దిల్ రాజుకి థియేటర్లు సమస్య తమిళనాడులో ఎదురయ్యే అవకాశాలు భారీగా కనిపిస్తున్నాయి. ఆ విధంగా దిల్ రాజుకి మైత్రి మూవీ మేకర్స్ ఈసారి ఇలా చెక్ పెడుతోంది అనే వాదన వినిపిస్తోంది.

Exit mobile version