దిల్ రాజు నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. అయితే ఆయన ఇప్పుడు వరుస సినిమాలు మళ్ళీ లైన్లో పెట్టారు. తాజాగా తమ్ముడు ప్రమోషన్స్ లో ఆయన తన లైనప్ వెల్లడించారు. ముందుగా ఆయన మాట్లాడుతూ ఎఫ్ డీసీ నుంచి గద్దర్ అవార్డ్స్ చేశాం. నెక్ట్స్ ప్రస్తుతం మన రాష్ట్రంలో ఆగిపోయిన చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాలని అనుకుంటున్నాం. ప్రభుత్వం తరపున ఆన్ లైన్ టికెటింగ్, రన్ ట్రాక్ తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది.
Also Read :AR Rahman : గ్రామీ విజేతకు గ్రాండ్ వెల్‌కమ్.. రెహమాన్ స్టన్నింగ్ కామెంట్స్..!
ప్రస్తుతం మా సంస్థలో రౌడీ జనార్థన, ఎల్లమ్మ, దేత్తడి ప్రొడక్షన్ లో ఉన్నాయి. మరో ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ ఏడాది చేస్తున్న నాలుగు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కు తీసుకొస్తాం. వచ్చే ఏడాదిలో చేయాల్సిన ఐదారు మూవీస్ స్క్రిప్ట్ నెరేషన్ స్టేజ్ లో ఉన్నాయి. అవి 2026లో స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఎస్వీసీ, దిల్ రాజు ప్రొడక్షన్స్ లో రాబోతున్న కొత్త మూవీస్. నెక్ట్స్ ఇయర్ వచ్చే సినిమాల్లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒకటి, మార్కో మూవీ డైరెక్టర్ హనీఫ్ తో ఒక సినిమా ఉంటాయి.
Also Read :Ashwin: టీమిండియా ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చిన అశ్విన్..!
అలాగే ఇద్దరు కొత్త దర్శకులతో సినిమాలు లాక్ చేశాం. యానిమల్ తో ఒక సినిమా ఉంటుంది. అందులో నటించే స్టార్ హీరో కోసం చూస్తున్నాం. ఇవి కాకుండా దిల్ రాజు డ్రీమ్స్ లో రెండు మూడు చిత్రాలు లైనప్ లో ఉన్నాయి. ఎలాంటి కంటెంట్ తో సినిమాలు తీస్తే ఆడియెన్స్ థియేటర్స్ కు వస్తారు అనేది డిస్కస్ చేస్తున్నాం అని అన్నారు. ఇది కాక జఠాయు, రావణం సినిమా కూడా చేస్తామని వాటికి సమయం పడుతుందని చెప్పుకొచ్చారు.
