Site icon NTV Telugu

Dil Raju : నెగెటివ్ ట్రోలింగ్‌కు చెక్.. మంచు విష్ణు మార్గాన్ని ఫాలో అవుతున్న దిల్ రాజు”

Dil Raju

Dil Raju

నెగెటివ్‌ ట్రోలింగ్‌ని, ఫేక్‌ రివ్యూస్‌ని అరికట్డడంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం అంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు. ఎందుకంటే ‘కన్నప్ప’ మూవీ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడేదని అభినందించాడు. ఇకపై మేము కూడా అదే ఫాలో అవుతామని చెప్పారు. ఇంతకీ ఏంటా నిర్ణయం అంటే..

Also Read : Komali : నేను అది కాదు.. రూమర్లకు కౌంటర్ ఇచ్చిన కోమలి ప్రసాద్

మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్‌కి రెండు రోజుల ముందే మంచు విష్ణు ఓ హెచ్చరికను జారీ చేశారు. ‘కన్నప్ప’ సినిమాని టార్గెట్‌గా చేసుకొని కావాలని ఎవరైన నెగెటివ్‌గా పోస్టులు పెట్టిన, వ్యక్తిగత టార్గెట్ చేసిన.. ఉద్దేశ్యపూర్వకంగా విమర్శలు చేస్తూ పరువుకు భంగం కలిగిస్తే కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరిస్తూ పబ్లిక్‌ కాషన్‌ నోటీస్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది. రిలీజ్‌ తర్వాత ఫేక్‌ రివ్యూస్‌, నెగెటివ్‌ ట్రోలింగ్‌ పెద్దగా జరగలేదు. ట్వీటర్‌లో సినిమాపై, మంచు ఫ్యామిలీపై నెగెటివ్‌ పోస్ట్‌లు పెట్టలేదు. సినిమాకు విమర్శల కంటే ప్రశంసలే ఎక్కువగా వచ్చాయి. అయితే ఈ విషయంలో దిల్ రాజు విష్ణు పద్దతికి ఫిదా అయ్యారు..

Also Read : Abhishek Bachchan : ఆమె మాటలే నాకు బలం..

ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ జులై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. నెగెటిట్‌ ట్రోలింగ్‌పై స్పందించారు.. ‘ ‘కన్నప్ప చిత్రబృందం మంచి నిర్ణయం తీసుకుంది. రిలీజ్‌కు ముందే అలా ఒక హెచ్చరిక జారీచేసింది.. దీంతో ఫేక్‌ రివ్యూస్‌, నెగెటివ్‌ ట్రోలింగ్‌, పైరసీ తగ్గిపోతుంది. అలా అని రివ్యూస్‌ని ఆపడం మా ఉద్దేశం కాదు. రివ్యూస్‌ రాయండి. కానీ రాసే ముందు ఒక్కసారి ఆలోచించండి. సినిమాపై కావాలని నెగెటివ్‌గా రాస్తే.. ఎక్కువగా నష్టపోయేది నిర్మాత మాత్రమే. హీరోలు, దర్శకులు ఈ సినిమా కాకపోతే మరో సినిమాతో హిట్‌ కొడతారు. కానీ నిర్మాత అయితే ఆ సినిమాకు డబ్బులు పోగొట్టుకోవాల్సిందే కదా? అది దృష్టిలో పెట్టుకొని జన్యూన్‌గా రివ్యూస్‌ ఇవ్వండి. దయచేసి హెల్ప్ చేయకపోయినా పర్లేదు ..డ్యామేజ్‍ మాత్రం చేయద్దు’ అని దిల్‌ రాజు విజ్ఞప్తి చేశాడు.

Exit mobile version