Site icon NTV Telugu

Dil Raju: పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు

Dil Raju

Dil Raju

థియేటర్ల బంద్ వ్యవహారం, పవన్ కల్యాణ్ లేఖ తదితర అంశాలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోమవారం (మే26) మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా విషయం గురించి మాట్లాడుతూ అప్పుడు హరిహర వీరమల్లు అనే కళ్యాణ్ గారి సినిమా మే 9వ తేదీ రావాల్సి ఉంది అయితే ఆ సినిమా పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ఏప్రిల్ 26 సమయానికి సినిమా ఎప్పుడు వస్తుందని విషయం మీద క్లారిటీ లేదు.. నేను మే 18 న జరిగిన ఎగ్జిబిటర్స్ వాళ్ల సమావేశం కు వెళ్ళాను. ఆ మీటింగ్ లో కొందరు బంద్ చేస్తాము అన్నారు. అది తప్పు అని చెప్పాను. ఛాంబర్ కు లెటర్ ఇవ్వండి అందరం మాట్లాడి నిర్ణయం తీసుకొందాము అని చెప్పాను.

Also Read: Dil Raju: నాకు తెలంగాణాలో ఉన్నవి 30 థియేటర్లే!

అయితే ఆరోజే మీడియాలో జూన్ 1 న బంద్ అని చెప్పి వచ్చింది అది స్ప్రెడ్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా మే 21 న మీటింగ్ పెట్టి బంద్ గురించి చర్చించారు. పవన్ కళ్యాణ్ సినిమా ని ఆపుతున్నారు అని వార్తలు వచ్చాయి. గవర్నమెంట్ కి కూడా బంద్ గురించి రాంగ్ కమ్యూనికేషన్ వెళ్లింది. క‌ల్యాణ్ గారి సినిమా ఆపే ధైర్యం, ద‌మ్ము ఎవ‌రికీ లేదు.

Also Read: Dil Raju: అసలు ఈ థియేటర్ల వివాదం అక్కడే మొదలైంది!

మే 30న భైరవం.. జూన్ 5 కమల్ హాసన్ సినిమా ఉంది.. 12 కళ్యాణ్ గారి సినిమా.. 20 కుబేర.. జూలై 4 కింగ్డమ్ ఉంది ఏప్రిల్ మే థియేటర్లు చాలా వరకు మూతపడ్డాయి. థియేట‌ర్ల‌ని ఎవ‌రూ మూయ‌లేరు, నా ఎక్స్‌పీరియ‌న్స్ లో ఎక్క‌డా చూడ‌లేదు.. కావాలంటే షూటింగులు ఆపుకొన్నాం. నేను మంత్రి దుర్గేష్ గారి తో మాట్లాడాను. బంద్ జరగదు అని చెప్పాను. జూన్ జూలై లో కంటిన్యూ గా సినిమాలు వున్నాయి. అసలు జరిగింది వేరు బయటకు వచ్చింది వేరు అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

Exit mobile version