NTV Telugu Site icon

Dil Raju : తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్స్ పై దిల్ రాజు ప్రెస్ మీట్

Dil Raju6

Dil Raju6

సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇస్తూ స్పెషల్ జీవో జారీ చేసింది. అలాగే తెల్లవారు జామున ఉదయం 1:00, 4:00 గంటలకు బెన్ఫిట్ షోస్ వేసేలా పర్మిషన్స్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఇప్పడు తెలంగాణలో ఈ మూడు సినిమాలకు బెన్ఫిట్ షోస్, టికెట్ ధరలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే  సందిగ్దత నెలకొంది.

Also Read : Dil Raju : భాదిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం

ఈ సందర్భగా ప్రముఖ నిర్మాత దిల్ రాజుప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ” టికెట్ రేటు పెంచడం వల్ల 18 పర్సెంట్ గవర్నమెంట్ కు వెళుతుంది. భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వాల సహాయం ఉండాలి. అలాగే ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ చేశారు. తెలంగాణా సీఎం గారు సినీ ఇండస్ట్రీకి అన్ని ఇస్తాను అన్నారు ఆ ఆశతో మళ్లీ సీఎం ని కలుస్తాను. ఆయన నిర్ణయమే ఫైనల్. తెలుగు సినిమా భారీ స్థాయిలో రూపొందుతున్నాయి అందుకే ప్రపంచ ఖ్యాతి వచ్చింది. గవర్నమెంట్ కు ఇండస్ట్రీకి కి మధ్య ఎఫ్డీసీ చైర్మెన్ పదవి కీలకం మాకు ఒక విజన్ వుంది. ఇండస్ట్రీ కి ఉన్న చాలా సమస్యల ను పరిష్కరించే విధంగా ప్లాన్ చేస్తున్నాంకాల క్రమేణా హీరోలు విలన్ లు అయిపోతున్నారు. అవే జనాలు కూడా చూస్తున్నారు ‘ అని అన్నారు.

Show comments