NTV Telugu Site icon

Dil Raju : టాలీవుడ్ హీరోకి స్టేజిపైనే దిల్ రాజు షాకింగ్ కౌంటర్

Dil Raju

Dil Raju

బాహుబలి సినిమాలో నటుడిగా గుర్తింపు తెచ్చుకుని తర్వాత ఎవరికీ చెప్పొద్దు లాంటి విభిన్నమైన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాకేష్ వర్రే. ఇటీవలే పేక మేడలు అనే సినిమాతో నిర్మాతగా మారిన ఆయన ఇప్పుడు జితేందర్ రెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉమ్మడి జగిత్యాల జిల్లాకు చెందిన అప్పటి ఏబీవీపీ దివంగత నేత జితేందర్ రెడ్డి బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ప్రెస్ మీట్ లో సెలబ్రిటీస్ రావడం లేదని అంటూ ఆయన కామెంట్స్ చేశారు. ఒక సినిమా తీయడం ఎంత కష్టమో సెలబ్రిటీలను ప్రమోషనల్ ఈవెంట్స్ కు తీసుకురావడం అంతే కష్టమని చెప్పుకొచ్చాడు. ఉదయం నుంచి మెసేజ్లు పెడుతున్న ఎవరూ పట్టించుకోవడంలేదని ఆయన వాపోయాడు.

D55 : ‘అమరన్’ డైరెక్టర్ తో ధనుష్.. మూవీ షురూ

అయితే తాజాగా జరిగిన కిరణ్ అబ్బవరం క సక్సెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజు రాకేష్ వర్రే వ్యాఖ్యల మీద స్పందించాడు. రాకేష్ నిన్న ప్రెస్ మీట్ లో సెలబ్రిటీలు రావడం లేదని అంటున్నాడు రారమ్మా ఎందుకు వస్తారు? ఎవరి బిజీ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. వాళ్ల టైం మీ టైంతో సెట్ అయితే వస్తారు. మీడియాకు ఏముంది ఎవరైనా సెలబ్రిటీలు వస్తేనే వాళ్ళు క్లిక్స్ వాళ్ళకి వస్తాయి. మన బాధ మనది, అసలు సెలబ్రిటీలు వచ్చారా రాలేదా అన్నది పాయింట్ కాదు. నువ్వు ఎలా నీ సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకువెళ్లావు అనేదే పాయింట్ అని అన్నారు. ఎలా అయినా కంటెంట్ తో వచ్చి ప్రేక్షకులను అలరించాలి కానీ ఏవో అంచనాలు పెట్టుకుని సినిమాలు చేయొద్దని అన్నారు. .

Show comments