Dil Raju: రాకింగ్ స్టార్ యశ్‌తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dil Raju: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ‘టాక్సిక్’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 ఏళ్లలో 476 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి, 63 చిత్రాలను నిర్మించిన అనుభవం తనకు ఉందని తెలిపారు. అన్ని భాషల్లో సినిమాలు నిర్మిస్తూ పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేతకు ఆయన అభినందనలు తెలిపారు. తమిళం, కన్నడ, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో కేవీఎన్ సంస్థ సినిమాలు చేస్తోందని ప్రశంసించారు. యశ్‌తో తన పరిచయం ‘కేజీఎఫ్’ సమయంలోనే ఏర్పడిందని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ కొత్త దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌తో సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయానని అన్నారు. అయితే ముంబైలో ‘టాక్సిక్’ విజువల్స్ చూసిన తర్వాత యశ్ విజన్ ఏ స్థాయిలో ఉందో అర్థమైందన్నారు.
‘‘కేజీఎఫ్ తర్వాత ఎవరైనా మరింత పెద్దగా ఆలోచిస్తారు. కానీ యశ్ తన కెరీర్‌ను పాన్ ఇండియాను దాటి వరల్డ్ సినిమాగా మార్చే దిశగా వెళ్తున్నారు. ‘టాక్సిక్’ విషయంలో ఆయన విజన్‌కు హ్యాట్సాఫ్’’ అని దిల్ రాజు కొనియాడారు. ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను దక్కించుకోవడంపైనా దిల్ రాజు స్పందించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ చెప్పిన నంబర్‌ను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అంగీకరించానని వెల్లడించారు. యశ్, కేవీఎన్ సంస్థల విజన్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇక ఈ సినిమా రూ.2,000 కోట్ల వసూళ్లు సాధించే అవకాశం ఉందని మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ మిశ్రా చెప్పిన విషయాన్ని కూడా దిల్ రాజు ప్రస్తావించారు. ‘‘విశాల్‌ను కలిసినప్పుడు ‘టాక్సిక్’ రూ.2,000 కోట్ల సినిమా.. ఇండియాలో రూ.2,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అన్నాడు’’ అని తెలిపారు. అదే సమయంలో యశ్‌తో నేరుగా తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారనే ప్రశ్నకు కూడా దిల్ రాజు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. యశ్‌తో సినిమా చేయడం కన్ఫర్మ్ అయిందని, అయితే ఎప్పుడు ప్రారంభమవుతుందో తనకు కూడా తెలియదన్నారు. సరైన కథ దొరికినప్పుడు ఇద్దరూ కలిసి సినిమా చేస్తామని యశ్ చెప్పినట్లు వెల్లడించారు. ఇక ‘టాక్సిక్’ కోసం పనిచేస్తున్న యశ్, గీతు మోహన్‌దాస్, కేవీఎన్ ప్రొడక్షన్స్, కియారా అద్వానీతో పాటు మొత్తం చిత్రబృందానికి దిల్ రాజు ఆల్ ది బెస్ట్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ‘టాక్సిక్’కు భారీ సౌండ్ వెళ్లాలని అభిమానులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ఈవెంట్లో హైలైట్‌గా నిలిచాయి.
Also Read
- Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
- Gautam Ghattamaneni: నితీశ్ తివారీ ‘రామాయణ’కు మహేశ్ బాబు కొడుకు దిమ్మతిరిగే రేటింగ్.. గౌతమ్ రివ్యూ వైరల్!
- January 12 Vidudala: సంక్రాంతి రేసులో ముందే దూకుడు.. అమెరికాలో సందడి చేయనున్న ‘జనవరి 12 విడుదల’ టీమ్!
- Poonam Kaur : ముందుంది అసలు సినిమా.. పవన్ విడాకుల వేళ పూనమ్ కౌర్ ట్వీట్ కలకలం!
తాజావార్తలు
-
CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్‌లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
-
IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
-
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్‌తో సమరం.. జట్టు ప్రకటన..
-
Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!