గ్యాప్ తీసుకోలేదు వచ్చిందంతే అంటోంది సంయుక్త మీనన్. భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్ లక్కీ లేడీగా అవతరించిన ఈ మలయాళ కుట్టీ జోరుకు బ్రేకులేసింది డెవిల్ ప్లాప్. ఈ ప్లాప్ ఆమె కెరీర్నీ పెద్దగా ప్రభావితం చేయలేదు కానీ ఆమె కమిటైన చిత్రాలు కంప్లీట్ కాకపోవడంతోనే ఊహించని గ్యాప్ వచ్చేసిందీ. ఈ గ్యాప్ ఫిల్ చేసేందుకు బిగ్ స్కెచ్చే వేస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ఈ ఇయర్ ఎండింగ్ నుండే ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వబోతుంది.
Also Read : Prabhas : అప్పుడు కన్నప్ప.. ఇప్పుడు మిరాయ్.. కరుణామయుడు రెబలోడు
అఖండ2 వాయిదా పడిందీ కానీ లేకుంటే సంయుక్త సందడి సెప్టెంబర్ నుండే స్టార్టయ్యేది. రావడం లేటేమో కానీ రావడం పక్కా అన్న బ్యూటీ డిసెంబర్ నుండి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో పలకరించబోతుంది. డిసెంబర్‌లో అఖండ2 రిలీజయ్యే ఛాన్స్ ఉందని బాలకృష్ణ ఇప్పటికే లీక్ చేసేశారు. రొమాంటిక్ ఫిల్మ్ నారీ నారీ నడుమ మురారీ సంక్రాంతికి రాబోతుంది. ఇవే కాకుండా తెలుగులో మరో టూ- త్రీ ఫిల్మ్స్ కు కమిటైంది. మైథాలజీ ఫిల్మ్ నిఖిల్ స్వయంభు, బెల్లకొండ సాయి శ్రీనివాస్ హైందవ, పూరీ జగన్నాథ్- సేతుపతి ఫిల్మ్స్ కూడా నెక్ట్స్ ఇయరే రాబోతున్నాయి. టాలీవుడ్‌లో సినిమాలు చేస్తూనే ఇతర ఇండస్ట్రీలను చుట్టేస్తోంది సంయుక్త మీనన్. బాలీవుడ్‌లో మహారాగ్ని క్వీన్స్ ఆఫ్ క్వీన్ చేస్తోంది. ఇక ఎన్నో సంవత్సరాలుగా తెరకెక్కుతోన్న మోహన్ లాల్- జీతూ జోసెఫ్ ఫిల్మ్ రామ్ కూడా నెక్ట్స్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ బెంజ్ కూడా ప్రిపేరవుతోంది. ఈ సినిమాలన్నీ కూడా 2026లో రిలీజ్ కానున్నాయి. ఈ లైనప్ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ చూస్తుంటే సంయుక్త కంబ్యాక్ వేరే లెవల్ లో ఉండేలా ఉంది.
