Dhurandhar 2: ధురంధర్-2లో డైరెక్టర్ సతీమణి.. టర్నింగ్ పాయింట్‌గా నిలిచే క్యామియో రోల్‌!

  • ధురంధర్ 2పై భారీ అంచనాలు
  • మార్చి 19న థియేటర్లలో ధురంధర్ 2 విడుదల
  • ధురంధర్ 2లో డైరెక్టర్ సతీమణి
Yami Gautam Act In Dhurandhar

Yami Gautam Act In Dhurandhar

Yami Gautam To Act in Dhurandhar 2: బాలీవుడ్‌లో ఆసక్తిని రేపుతున్న యాక్షన్ డ్రామా మూవీ ‘ధురంధర్: ది రివెంజ్’. ధురంధర్ ఊహించని హిట్ అందుకోవడంతో పార్ట్ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ధురంధర్ 2 సినిమా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇప్పటికే పార్ట్ 2పై భారీ అంచనాలు ఉండగా.. ఓ బాలీవుడ్ హీరోయిన్ స్పెషల్ క్యామియో పాత్రలో కనిపించబోతున్నారన్న వార్తలు మరింత హైప్‌ను పెంచుతున్నాయి.

ధురంధర్ 2 సినిమాలో హీరోయిన్ యామీ గౌతమ్ కీలకమైన యాక్షన్ ప్యాక్డ్ క్యామియో రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కథలో టర్నింగ్ పాయింట్‌గా నిలిచే పాత్రగా ఆమె క్యారెక్టర్ ఉంటుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ క్యామియో కోసం యామీ దాదాపు ఐదు రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నారని సమాచారం. తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ.. ఆమె పాత్రకు మంచి ఇంపాక్ట్ ఉండబోతుందని అంటున్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ సతీమణి యామీ అన్న విషయం తెలిసిందే. మంచి రోల్ కావడంతో తన సతీమణినే పార్ట్ 2లో రంగంలోకి దించాడట.

Also Read: Arshdeep Singh-Tilak Varma: అర్ష్‌దీప్ సింగ్‌పై తిలక్ వర్మ ఫైర్.. డ్రెస్సింగ్ రూమ్‌లో టెన్షన్ (వీడియో)!

యామీ గౌతమ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌కు ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. గతంలో ఈ జంట కలిసి చేసిన ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘ఆర్టికల్ 370’ వంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దేశభక్తి, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రాల్లో యామీ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్‌ వస్తుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ధురంధర్ 2 పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ప్రతీకారం, శక్తివంతమైన పాత్రలు, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందని టాక్. యామీ క్యామియోతో పాటు మరిన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉంటాయని సమాచారం.