Dhruva Natchathiram : విక్రమ్ సినిమా వస్తోంది.. కానీ సూర్యతో పోటీ తప్పేలా లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చియాన్ విక్రమ్ అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న స్పై థ్రిల్లర్ ‘ధృవ నక్షత్రం’. ఎన్నో ఏళ్లుగా విడుదలకు నోచుకోని ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కు ముహూర్తం కుదిరేలా కనిపిస్తోంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం నుండి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ‘ధృవ నక్షత్రం’ చిత్రాన్ని మే 22న విడుదల చేసేందుకు మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అదే సమయంలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘కరుప్పు’ సినిమా కూడా మే 14న విడుదల కానుంది.
వారం రోజుల వ్యవధిలో రెండు భారీ సినిమాలు విడుదల కావడం బాక్సాఫీస్ వద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ‘ధృవ నక్షత్రం’ టీమ్ ‘కరుప్పు’ చిత్ర నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతోంది. సూర్య సినిమాను ఒక రెండు వారాల పాటు వాయిదా వేయాలని వారు కోరుతున్నట్లు సమాచారం. ఒకవేళ ‘కరుప్పు’ టీమ్ ఇందుకు అంగీకరించకపోతే అప్పుడు గౌతమ్ మీనన్ తన సినిమానే జూన్ మొదటి వారానికి అంటే మే 22 నుండి రెండు వారాల తర్వాత వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. గత ఎనిమిదేళ్లుగా ఆర్థిక మరియు న్యాయపరమైన ఇబ్బందుల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇటీవలే మద్రాస్ హైకోర్టులో న్యాయ వివాదాలు ముగియడంతో ఈ వివాదాలన్నీ సర్దుమణిగాయని మే 22 విడుదలకు లైన్ క్లియర్ అయిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. విక్రమ్ ఈ సినిమాలో స్టైలిష్ స్పై ఏజెంట్‌గా కనిపిస్తుండగా హారిస్ జయరాజ్ సంగీతం సినిమాపై అంచనాలను పెంచింది.
Also Read
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!