Dhanush: “నాకు యాక్టింగ్ నేర్పిస్తావా?”.. ఇరుముడి పాపతో ధనుష్ వీడియో కాల్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘ఇరుముడి’ సినిమా ఇప్పుడు సినీ ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ఈ చిత్రంలో రవితేజ కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర.. తన ఎమోషనల్ యాక్టింగ్‌తో అందరి కంటతడి పెట్టిస్తోంది. తాజాగా ఈ చిన్నారి నటనకు కోలీవుడ్ స్టార్ హీరో, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ సైతం ఫిదా అయిపోయారు. ఇటీవలే ‘ఇరుముడి’ సినిమా చూసిన ధనుష్.. నక్షత్ర నటనకు ముగ్ధుడై ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ ద్వారా నక్షత్రతో ధనుష్ స్వయంగా వీడియో కాల్లో మాట్లాడారు. సినిమాలో ఆమె పలికించిన భావోద్వేగాలను ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఈ వీడియో కాల్లో ధనుష్ అడిగిన ఒక మాట ఆ చిన్నారిని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. “నీ నటన అద్భుతం.. నాకు కూడా యాక్టింగ్ నేర్పిస్తావా?” అంటూ ధనుష్ ఎంతో ఆప్యాయంగా అడగడంతో నక్షత్ర ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. అంతటి స్టార్ హీరో తనను అలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక ఆశ్చర్యపోయింది.
నక్షత్రతో ముచ్చటించిన అనంతరం.. వీలైనంత త్వరలో తాను నేరుగా వచ్చి కలుస్తానని ధనుష్ మాట ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇండియాలోనే బెస్ట్ యాక్టర్స్‌లో ఒకరైన ధనుష్ నుంచి ఇలాంటి కాంప్లిమెంట్ రావడం ఆ చిన్నారి కెరీర్‌కు దక్కిన అతిపెద్ద బహుమతి అని సినీ అభిమానులు అంటున్నారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కళ్లతోనే హావభావాలు పలికిస్తూ, ఎమోషనల్ సీన్స్‌ను పండించిన నక్షత్ర నటన.. సినిమాకే హైలైట్‌గా నిలిచింది.’మణమ్మ’గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టేసుకున్న ఈ చిన్నారికి ఇండస్ట్రీ వర్గాల నుంచి సైతం భారీగా ప్రశంసలు దక్కుతున్నాయి.
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
తాజావార్తలు
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!