Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!

Dhanush Supports Sai Pallavi

Dhanush Supports Sai Pallavi

Dhanush: పాన్-ఇండియా రేంజ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన్న ‘రామాయణ’ సినిమాలో సీతాదేవి పాత్రకు నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఎంపికపై కొందరు పనిగట్టుకుని ట్రోలింగ్‌ చేస్తున్న వాళ్లకి ధనుష్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. సీత పాత్రకు సాయిపల్లవిని మించిన పర్ఫెక్ట్ ఛాయిస్ మరొకటి ఉండదని కుండబద్దలు కొడుతూ, ఆమెకు సపోర్ట్‌గా నిలిచాడు. రీసెంట్‌గా నిర్వహించిన ‘ఓం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ధనుష్.. సాయిపల్లవిపై వస్తున్న విమర్శలపై నేరుగా స్పందించారు. ఆమెను తక్కువ చేసి మాట్లాడుతున్న వారి తీరును తీవ్రంగా తప్పుపడుతూ అసలు విషయాన్ని బయటపెట్టారు.

‘‘సాయిపల్లవిని విమర్శిస్తున్న తీరు చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఆమె కేవలం అద్భుతమైన నటి మాత్రమే కాదు.. అంతకుమించి స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి. సెట్స్‌లో షూటింగ్ బ్రేక్ దొరికిన ప్రతిసారీ ఆమె కళ్లముందే భగవంతుడిని ప్రార్థిస్తూ కనిపించేది. దేవుడిపై ఆమెకున్న భక్తి, నిబద్ధత మాటల్లో వర్ణించలేనిది. అలాంటి వ్యక్తిత్వాన్ని చూసిన తర్వాత.. ఆమె కంటే గొప్పగా సీత పాత్రను ఇంకెవరూ చేయలేరని నాకనిపించింది’’ అంటూ ధనుష్ విమర్శకుల నోళ్లు మూయించారు. గతంలో బ్లాక్‌బస్టర్ హిట్ ‘మారి 2’లో ఆమెతో కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. ‘‘మొదట్లో ఆమె చాలా సైలెంట్‌గా ఉండేది. కేవలం కెమెరా రోల్ అయినప్పుడే మాట్లాడేది. కానీ ఇప్పుడు నటిగా ఆమె ఎంతో పరిణితి సాధించింది. తెరపై భావోద్వేగాలను పండించడంలో ఆమె టైమింగ్ అద్భుతం. సీత వంటి పవిత్రమైన, సున్నితమైన పాత్రను చేయడం ఎవరికైనా పెద్ద సవాలు. అలాంటి కఠినమైన పాత్రను సైతం ఆమె ఎంతో అంకితభావంతో అద్భుతంగా చేసి చూపించింది’’ అని ధనుష్ కొనియాడారు. రాజ్‌కుమార్ పెరియసామి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ఓం’ చిత్రంలో సాయిపల్లవి ‘నిత్యారెడ్డి’ అనే పవర్‌ఫుల్ సీబీఐ ఆఫీసర్ క్యారెక్టర్‌లో అదరగొట్టనున్నారు. ధనుష్, సాయిపల్లవి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా నవంబరు 20న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రానుంది.