Site icon NTV Telugu

Dhanush rayan : పెద్దలకు మాత్రమే…వారికి నో ఎంట్రీ…

Untitled Design (8)

Untitled Design (8)

తమిళ అగ్రనటుడు ధనుష్, రీసెంట్ సినిమా కథల ఎంపిక ప్రతీ ఒక్కరిని ఆశ్చర్య పరుస్తోంది. నేటివిటికి దగ్గరగా ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు ఒకే చేస్తున్నాడు. అసురున్, వాడా చెన్నయ్, కెప్టెన్ మిల్లర్, కర్ణన్ ఆ కోవలో వచ్చినవే. వేటికవే భిన్నమైన కథ, సహజత్వమైన కథనం ఉండే చిత్రాలు. ఇలా విభిన్నమైన సినిమాలతో వరుస హిట్లు కొడుతున్నాడు ధనుష్.

కెరీర్‌లో 50వ సినిమా చేస్తున్నాడు ధనుష్. ఈ హీరో నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించింన చిత్రం రాయన్. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ గ్లిమ్స్ కు మంచి ఆదరణ లభించింది. ఈ సారి మరో న్యూ కాన్సెప్ట్ తో వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం నుండి వచ్చిన మొదటి సింగిల్‌ సినిమాపై హైప్ మరింత పెంచింది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు రెడీగా ఉన్నాడు రాయన్. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యకమాలు కంప్లిట్ చేసుకొంది. చిన్న చిన్న కట్స్ తో ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ టీమ్. రక్తపాతం, హింస పాళ్లు కొద్దిగా ఎక్కువగా ఉండడంతో ‘A’ జారీ చేశారు. 18 ఏళ్ల లోపు వయసుగలవారికి రాయన్ చూసేందుకు అనుమతి లేదు. ఈనెల 26న పాన్ ఇండియా భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది రాయన్.

రాయన్‌లో ఎస్‌జె సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, దుషార విజయన్, అపర్ణ బాలమురళి మరియు వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీత స్వరకర్త. మరోవైపు ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరుడు అనే స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.

Also Read: మా అల్లుడు వెరీగుడ్.. కెజిఎఫ్ – 2 తర్వాత కల్కి మాత్రమే..

Exit mobile version