ధనుష్ – నయనతార మధ్య వివాదం చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా నానుతోంది. ఈ అంశం మీద ఎన్నో చర్చలు కూడా జరుగుతున్నాయి. నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు రానివ్వలేదు. నెట్ ఫ్లిక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని, ఆ పెళ్లిని తన వ్యక్తిగత జీవితంలోని మరికొన్ని విశేషాలు ఒక డాక్యుమెంటరీలా చేసి అదే వేదికపై తాజాగా రిలీజ్ చేశారు. అలా చేసినందుకుగాను కొన్ని కోట్ల రూపాయలు నయనతార ఖాతాలో జమ అయ్యాయి. అయితే నయనతార డాక్యుమెంటరీలో ఒక సినిమా ఆఫ్ స్క్రీన్ విజువల్స్ వాడాల్సి వచ్చింది. ఎందుకంటే నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ మొదటిసారి పరిచయమైన సినిమా ధనుష్ నిర్మించిన ‘నేనే రౌడీ’. ఈ సినిమా ఫుటేజ్ ని వాడినట్టు ట్రైలర్ లో తెలియడంతో ఏకంగా 10 కోట్ల కాపీరైట్ కోసం డిమాండ్ చేశాడు ధనుష్.
Ram Charan: మాలలో ఉండగా దర్గాకి వెళ్లడం పాపమా?
ఈ మేరకు నయనతార కి నోటీసులు పంపించగా నయనతార ఓపెన్ లెటర్ రాసి మూడు సెకండ్ల వీడియో వాడినందుకు పది కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం ధనుష్ జెలసీ క్యారెక్టర్ ని బయటపెట్టిందని తీవ్రమైన విమర్శలే చేసింది. నయనతారకు సోషల్ మీడియా ద్వారా ధనుష్ తగిన సమాధానం ఇస్తాడని చాలా మంది ఆశించారు, కానీ అతను మౌనంగా ఉన్నాడు. సోషల్ మీడియాలో నయనతారతో గొడవ పడటం ధనుష్ కు ఇష్టం లేదనేది తాజా సంచలనం. అతను చట్టపరంగా, న్యాయపరమైన మార్గాల ద్వారా పోరాడతారని అనుకుంటున్నారు. నయనతార నిర్మాత కానందున “నానుమ్ రౌడీ ధాన్” ఫుటేజీని ఉపయోగించుకునే హక్కు లేదు. నిర్మాతగా ధనుష్ దానిని ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఇది నిర్మాతగా అతని హక్కు. నయనతార సోషల్ మీడియా యుద్ధంలో గెలిచినట్లు కనిపిస్తున్నప్పటికీ, న్యాయస్థానంలో ఆమెకు మొట్టికాయలు పడే అవకాశమే ఎక్కువ.