Site icon NTV Telugu

Dhanush : మీరు ఎన్ని కుట్రలు చేసినా.. నేను భయపడను..

Danush

Danush

తమిళ స్టార్ ధనుష్ కి  తెలుగులో కూడా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ప్రజంట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో  ‘కుబేరా’ మూవీ చేస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్, నాగార్జున ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా చైన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో ధనుష్ స్పీచ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు..

Also Read : Vidya Balan : ఇండస్ట్రీలో అలా అయితేనే కెరీర్ ఉంటుంది..

‘అభిమానుల కొరకు నేనెప్పుడు నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నే ఉంటాను. నాపై, నా సినిమాల పై ఎంత నెగిటివ్ ప్రచారం చేస్తారో చేసుకోండి. నా సినిమాల విడుదలకు ముందు ఏదో ఒక విషయంలో కుట్రలు చేస్తూనే ఉంటారు. అయినా నాకు ఏం భయం లేదు. ఎందుకంటే 23 సంవత్సరాలు‌గా నా అభిమానులు నా వెంటే ఉంటున్నాడు. మీరెంత నెగిటివ్ ప్రచారం చేసినా నేను ఊరుకున్న వారు ఊరుకోరు. వీరంతా ఎప్పటికీ నాతోనే ఉంటారు. ఆనందంగా జీవించాలని మనం బలంగా కోరుకోవాలి. అది మనలోనే.. మనతోనే ఉంటుంది. నా వరకు నేను మంచి భోజనం చేసి సంతోషిస్తాను అదే నాకు నిజమైన ఆనందం. మన సంతోషాన్ని మించినది ఏమీ ఉండదు’ అని తెలిపారు.

Exit mobile version